Parliament Special Sessions: ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్రం.. ఇంత హడావుడిగా ఎందుకంటే?

అమృత్‌కాల్ సందర్భంగా పార్లమెంటులో అర్థవంతమైన చర్చ కోసం వేచి చూస్తున్నానని ప్రహ్లాద్ జోషి రాశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు సాగాయి

Parliament Special Sessions: ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్రం.. ఇంత హడావుడిగా ఎందుకంటే?

Parliament Special Sessions: సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 సమావేశాలతో కూడిన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని పిలుస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 10కి పైగా ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బిల్లు కారణంగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

G-20 Summit: పుతిన్ దారిలోనే జిన్‭పింగ్.. జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు హాజరు కావడం లేదట

అమృత్‌కాల్ సందర్భంగా పార్లమెంటులో అర్థవంతమైన చర్చ కోసం వేచి చూస్తున్నానని ప్రహ్లాద్ జోషి రాశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు సాగాయి. ఈ సమయంలో మణిపూర్ హింసాకాండపై ఉభయ సభల్లోనూ తీవ్ర దుమారం చెలరేగింది. ఆ సమయంలో కొన్ని కీలక బిల్లులు పెండింగులో పడిపోయాయి. అయితే ఈ ప్రత్యేక సమావేశాల్లో వాటిని ఆమోదింపజేసుకోవాలని మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

INDIA 3rd Meet: ఇండియా కూటమి కన్వీనర్‭గా నితీశ్ కుమార్‭కే ఎక్కువ మద్దతు.. లాలూ పెట్టిన ఈ షరతుకు ఒప్పుకుంటే నితీశే అధినేత

మణిపూర్‌ హింసాకాండపై ప్రతిపక్ష కూటమి ఇండియా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నారు. సభ్యత్వ పునరుద్ధరణ అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వర్షాకాల సమావేశంలో పాల్గొన్నారు. తన ప్రసంగంలో మణిపూర్ హింసాకాండపై కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చివరి రోజున సభలో ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. అయితే మూజువాణి ఓటుతో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.