Longest Railway Platform: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్లాట్‭ఫాంను ప్రారంభించిన ప్రధాని మోదీ

530 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేపట్టిన ఈ విద్యుదీకరణ ప్రాజెక్ట్ విద్యుత్ ట్రాక్షన్‌పై ఇబ్బందులు లేని రైల్వే ప్రయాణాల్ని అందిస్తుంది. పునరాభివృద్ధి చేయబడిన హోసపేట స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. హంపి స్మారక చిహ్నాలను తలపించేలా ఈ స్టేషన్‭ను రూపొందించారు

Longest Railway Platform: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్లాట్‭ఫాంను ప్రారంభించిన ప్రధాని మోదీ

Modi inaugurates world's longest railway platform

Updated On : March 12, 2023 / 9:28 PM IST

Longest Railway Platform: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్లాట్‭ఫాంను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. హుబ్బళీ స్టేషన్‌లో నిర్మించిన ఈ ప్లాట్‭ఫాంను ప్రారంభిస్తూ జాతికం అంకితం చేశారు. ఈ రికార్డును ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సైతం గుర్తించింది. 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను 20 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక దీనితో పాటు ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంపొందించడం కోసం హోసపేట-హుబ్బల్లి-తినైఘాట్ సెక్షన్ విద్యుదీకరణతో పాటు అప్‌గ్రేడ్ చేసిన హోసపేట స్టేషన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

PM security breach: మరోసారి తెరపైకి పీఎం భద్రతా లోపం.. చర్యలపై పంజాబ్‭ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం

530 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేపట్టిన ఈ విద్యుదీకరణ ప్రాజెక్ట్ విద్యుత్ ట్రాక్షన్‌పై ఇబ్బందులు లేని రైల్వే ప్రయాణాల్ని అందిస్తుంది. పునరాభివృద్ధి చేయబడిన హోసపేట స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. హంపి స్మారక చిహ్నాలను తలపించేలా ఈ స్టేషన్‭ను రూపొందించారు. హుబ్బ‌ళ్లి-ధార్వాడ్ స్మార్ట్ సిటీకి సంబంధించిన వివిధ ప‌థ‌కాల‌కు ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం 520 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు.

MP: సీఎం ముందే పార్టీ అధ్యక్షుడి ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్ర మంత్రి

ప్రజలకు తృతీయ గుండె చికిత్స అందించడానికి దాదాపు 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న జయదేవ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, ధార్వాడ్ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. వీటిని 1,040 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇక సుమారు 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న తుప్పరిహళ్ల వరద నష్టం నియంత్రణ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు.