తెలుగులో మోడీ ట్వీట్లు: నేను వస్తున్నా!

  • Published By: vamsi ,Published On : March 29, 2019 / 04:34 AM IST
తెలుగులో మోడీ ట్వీట్లు: నేను వస్తున్నా!

Updated On : March 29, 2019 / 4:34 AM IST

తెలుగు రాష్ట్రాలలో నేడు పర్యటిస్తున్న నరేంద్రమోడీ అంతకుముందుగా ట్విట్టర్ ద్వారా తన పర్యటన వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న మోడీ ఇక్కడి ప్రజలను ఉద్దేశించి తెలుగులో ట్వీట్ చేశారు. ప్రజల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం నిర్వహించిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు వివరంగా చెప్పదలచుకున్నాను. మహబూబ్ నగర్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలను నేటి బహిరంగ సభలో పాల్గొనమని నేను ఆహ్వానిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు.
Read Also : హైదరాబాద్‌కు మోడీ.. భారీ భద్రత

అలాగే.. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన గురించి ప్రస్తావించిన మోడీ.. ఈ సాయంత్రం నేను కర్నూలులో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను.మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి, మోసపూరిత తెలుగుదేశం పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌లో అవినీతి, బలహీనమైన పరిపాలనతో అన్ని రంగాలలో తిరోగమనంలో ఉంది. యువత కలలు నెరవేర్చటానికి  నేను ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను. అంటూ మరో ట్వీట్ చేశారు.

 

Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష