ఈ రాష్ట్రాల్లో ఏడాది ప్రభుత్వ పాలన ఎలా ఉంది? వన్ఇండియా-పొలిటికల్ వైబ్ స్పెషల్ సర్వే..

తమ నాయకుల పని తీరు, పాలనా విధానాలు, ఎన్నికల హామీలపై ప్రజల స్పందన ఎలా ఉంది? అనే విషయం మీద సర్వే ఉంటుంది.

ఈ రాష్ట్రాల్లో ఏడాది ప్రభుత్వ పాలన ఎలా ఉంది? వన్ఇండియా-పొలిటికల్ వైబ్ స్పెషల్ సర్వే..

Updated On : May 23, 2025 / 6:21 PM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆయా ప్రభుత్వాలు ఏడాది పూర్తి చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా వన్ఇండియా-పోలిటికల్ వైబ్ కలిసి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఓ ప్రత్యేక సర్వే ప్రారంభిస్తున్నాయి.

ఈ సర్వేలో ముఖ్యంగా ఏమి చేస్తారు?

తమ నాయకుల పని తీరు, పాలనా విధానాలు, ఎన్నికల హామీలపై ప్రజల స్పందన ఎలా ఉంది? అనే విషయం మీద సర్వే ఉంటుంది. ప్రభుత్వ ఏడాది పాలనలో ఎలా పనిచేసింది? అనే దాని మీద ఓ అంచనాకు వచ్చేందుకు ఈ సర్వేను నిర్వహించనున్నారు. ప్రజాభిప్రాయాన్ని కచ్చితమైన రీతిలో తెలుసుకునేలా ఈ సర్వే నిర్వహిస్తారు.

ఎన్నికల హామీలు ఎంతవరకు అమలయ్యాయి? ప్రభుత్వం సమస్యలపై ఎలా స్పందించింది? రోడ్లు, నీరు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాల్లో ఎంత అభివృద్ధి జరిగింది? పేదలకు సాయం అందిందా? ప్రజలకు నాయకుల మీద నమ్మకం ఉందా? అన్న అంశాలపై సర్వే చేస్తారు.

ఎవరెవరి అభిప్రాయాలు తీసుకుంటారు?

నగరాలు, గ్రామాల్లోని అన్ని కులాలు, వయస్సుల వారు, మహిళలు, పురుషులు ఇలా విభిన్న వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంటారు. ప్రతి రాష్ట్రానికి విడిగా, ప్రతి భాషలో ఫలితాలు అందిస్తారు. కేవలం గణాంకాలు కాదు, ప్రజలు ఏమంటున్నారు? వాళ్ల ఆలోచనలు, ఆశలు ఏమిటి? అనే విషయాన్ని స్పష్టంగా చెబుతారు.

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ విధానాలు, రాజకీయ నాయకుల తీరుపై ప్రజల్లో అవగాహన పెరిగింది. హామీలు నిలబెట్టుకోలేని నాయకులకు తదుపరి ఎన్నికల్లో ఓట్లు వేయడం లేదు. కాబట్టి ఈ సర్వేలు తదుపరి ఎన్నికల ముందు ప్రజల మనసులో ఏం ఉందో అర్థం చేసుకోవడంలో ఉపయోగపడతాయి.