ర‌క్తం మ‌రుగుతోంది : బుడ్గామ్ సీఆర్పీఎఫ్ క్యాంప్ కి జ‌వాన్ల‌ మృతదేహాలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 15, 2019 / 07:47 AM IST
ర‌క్తం మ‌రుగుతోంది : బుడ్గామ్ సీఆర్పీఎఫ్ క్యాంప్ కి జ‌వాన్ల‌ మృతదేహాలు

జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్ర‌వ‌రి-14,2019) పాక్ కి చెందిన ఉగ్ర‌సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జ‌రిపిన ఎల్ఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జ‌వాన్ల మృతదేహాల‌ను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి త‌ర‌లించారు. అమ‌రులైన జ‌వాన్ల‌కు సైనికులు ఘ‌న నివాళి అర్పించారు.

ఈ దాడిని తాము మ‌ర్చిపోబోమ‌ని, క్ష‌మించే ప్ర‌శ‌క్తే లేద‌ని, ప్రాణాలు కోల్పోయిన అమ‌ర‌వీరుల‌కు సెల్యూట్ చేస్తున్న‌ట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది. అమ‌రుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని తెలిపింది. అతిక్రూర‌మైన ఈ దాడి పాల్ప‌డిన‌వారికి శిక్ష త‌ప్ప‌ద‌ని తెలిపింది. ల్వామా దాడిపై  అన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, సంస్థ‌ల‌తో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ స‌మావేశ‌మ‌య్యారు. 

దాడిలో అమ‌రులైన జ‌వాన్ల కుటుంబాల క‌న్నీళ్లు దేశ ప్ర‌జ‌ల‌ క‌ళ్ల‌ల్లో నీళ్లు తెప్పించాయి.చివ‌రిéరిగా త‌మ బిడ్డ‌ల‌తో మాట్లాడిన సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేసుకుంటూ గుండెలు ప‌గిలేలా రోదిస్తున్న జ‌వాన్ల కుటుంబాల‌ను చూసి అంద‌రూ క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. జ‌వాన్లపై దాడికి పాల్ప‌డిన వారిపై ఇక ఏమాత్రం ఆల‌స్యం చెయ్య‌కుండా వారిని ఏరిపారేయాల‌ని దేశ ప్ర‌జ‌లు అంటున్నారు.పుల్వామా దాడితో దేశ ప్ర‌జ‌ల ర‌క్తం మ‌రిగిపోతోంద‌ని ప్ర‌ధాని కూడా అన్నారు. ఉగ్ర‌వాదుల‌ను వ‌దిలిపెట్టే ప్ర‌శ‌క్తే లేద‌ని హెచ్చ‌రించారు.

Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Also Read : వన్ నేషన్ – వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు