Mother dies: అడవి పందితో అసాధారణ రీతిలో పోరాడి, కూతురి ప్రాణాలు కాపాడి.. మృతి చెందిన తల్లి

అమ్మ ప్రేమ అనిర్వచనీయం. తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా దిగుతుంది తల్లి. తన ప్రాణాలు పోయినా సరే పిల్లలను కాపాడుకోవాలని భావిస్తుంది. అమ్మ ప్రేమ ఎటువంటిదో మరోసారి నిరూపితమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో కూతురిని కాపాడడం కోసం అడవి పందితో భీకర పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయింది ఓ తల్లి.

Mother dies: అడవి పందితో అసాధారణ రీతిలో పోరాడి, కూతురి ప్రాణాలు కాపాడి.. మృతి చెందిన తల్లి

Mother dies

Updated On : February 27, 2023 / 3:53 PM IST

Mother dies: అమ్మ ప్రేమ అనిర్వచనీయం. తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా దిగుతుంది తల్లి. తన ప్రాణాలు పోయినా సరే పిల్లలను కాపాడుకోవాలని భావిస్తుంది. అమ్మ ప్రేమ ఎటువంటిదో మరోసారి నిరూపితమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో కూతురిని కాపాడడం కోసం అడవి పందితో భీకర పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయింది ఓ తల్లి.

దువాషియా బాయి (45) అనే మహిళ తన కూతురు రింకి (11)తో తెలియామర్ గ్రామంలో అటవికి సమీపంలో పనులు చేసుకుంటోంది. దువాషియా బాయి మట్టిని తవ్వుతున్న సమయంలో ఆ ప్రాంతానికి ఓ అడవి పంది దూసుకొచ్చింది. దువాషియా కూతురు రింకీపై దాడి చేయబోయింది. దీంతో గడ్డపారతో అడవి పందిని అడ్డుకుంది దువాషియా.

అయినా అడవి పంది వదలకుండా దాడి చేయడంతో దువాషియాకి తీవ్రగాయాలయ్యాయి. తనకు ఎన్ని గాయాలైన తన కూతురి వద్దకు అడవి పందిని వెళ్లనివ్వలేదు ఆ తల్లి. తన కూతురికి చిన్న గాయం కూడా కానివ్వలేదు. అడవి పందిని దువాషియా చంపేసింది. అయితే, తీవ్రగాయాలతో కాసేపటికే దువాషియా కూడా మృతి చెందింది. ఆమె కుటుంబానికి అటవీ శాఖ అధికారులు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇచ్చారు. మరో రూ.5.75 లక్షల పరిహారాన్ని త్వరలోనే అందించనున్నారు.

Tirupati Clash : తిరుపతిలో బీజేపీ, ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ