Gujarat Minister: “ఇక్కడ చదువు నచ్చకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోండి”
గుజరాత్ లో చదువుకుంటున్న పిల్లలకు ఇక్కడ చదువు ఇష్టం లేకపోతే తమ సర్టిఫికేట్లు తీసుకుని ఇతర రాష్ట్రాలకు, లేదా ఇతర దేశాలకు వెళ్లిపోవచ్చంటున్నారు రాష్ట్ర మంత్రి. ఇక్కడే పుట్టి, పెరిగి.

Gujarath Minister
Gujarat Minister: గుజరాత్ లో చదువుకుంటున్న పిల్లలకు ఇక్కడ చదువు ఇష్టం లేకపోతే తమ సర్టిఫికేట్లు తీసుకుని ఇతర రాష్ట్రాలకు, లేదా ఇతర దేశాలకు వెళ్లిపోవచ్చంటున్నారు రాష్ట్ర మంత్రి. ఇక్కడే పుట్టి, పెరిగి గుజరాత్ ను విమర్శించడం కంటే అదే బెటర్ అని చెప్తున్నారు గుజరాత్ మంత్రి జీతూ వఘానీ. రాజ్‌కోట్ లో ఓ స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. అక్కడకు విచ్చేసిన స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ ను కలిశారు.
ఇక్కడే పుట్టి పెరిగి ఇతర రాష్ట్రాల్లోని స్కూల్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉందని భావించే వాళ్లు వెళ్లిపోవచ్చన్నారు. పరోక్షంగా గుజరాత్ లోని ప్రభుత్వ పాఠశాలలను విమర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీకి తగిలేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘గుజరాత్ లో ఉండే కొందరు వ్యక్తులు, కొందరు పిల్లలు ఇక్కడే వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇతర రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ బాగుందనిపిస్తే.. మీడియా మిత్రుల సాక్షిగా రిక్వెస్ట్ చేస్తున్నా. బెటర్ గా అనిపించే రాష్ట్రానికి లేదా దేశానికి వెళ్లిపోండి. సర్టిఫికేట్ తీసుకుని వెళ్లిపోవచ్చు. ఇక్కడ అంతా తప్పుగానే ఉందని వ్యతిరేకించే వాళ్లు.. మార్పు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు’ అని మంత్రి అన్నారు.
Read Also : బడిలో భగవద్గీత.. గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం
విద్యాభివృద్ధికి సూచనలు ఇవ్వొచ్చు. కానీ, నిస్సహాయంగా ఉండే పేరెంట్స్, స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాలలను విమర్శించకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉండే టీచర్లు కంటే నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని చెప్పగలనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.