92 year old man : మ్యూజిక్ వింటూ..డ్యాన్సులు చేస్తూ.. కరోనాను జయించిన 92ఏళ్ల వృద్ధుడు

92 year old man : మ్యూజిక్ వింటూ..డ్యాన్సులు చేస్తూ.. కరోనాను జయించిన 92ఏళ్ల వృద్ధుడు

92 Year Old Old Man Who Conquered Corona (1)

Updated On : April 27, 2021 / 11:26 AM IST

92 year old old man who conquered Corona : కరోనా వచ్చిందని బాధపడుతూ..మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన యువకుల గురించి విన్నాం. రోగం కంటే భయం మాచెడ్డ గొప్పది భయ్యా అన్నట్లుగా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న క్రమంలో మధ్యప్రదేశ్ కు చెందిన 92 ఏళ్ల వ్యక్తి మాత్రం తనకు కరోనా పాజిటివ్ అని తెలిసి ఏ మాత్రం భయపడకుండా..బెంబేలెత్తిపోకుండా ధైర్యంగా ఉన్నాడు. హా..ఈ కరోనా నన్నేం చేస్తుందిలే..అనుకున్నాడు.

అనుకుని ఊరుకోలేదు. తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. హోం క్యారంటైన్ లోనే ఉండి ఉల్లాసంగా ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ..డ్యాన్సులు వేస్తూ కరోనా మహమ్మారిని తన ఒంటినుంచి తరిమేశాడు. 92 ఏళ్ల వయస్సులో అలా ధైర్యంగా ఉండి కరోనాను జయించిన ఆ వృద్ధుడి ధైర్యం ఈరోజుల్లో అందరికీ ఆదర్శవంతమని చెప్పటంతో అతిశయోక్తి లేదు. వయసు మీదపడిన ఎంతోమంది కరోనాను ధైర్యంగా జయిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు.

అటువంటి వ్యక్తులో మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్‌కు చెందిన తులసీరామ్ సేఠియా అనే 92 ఏళ్ల వృద్ధుడు కూడా ఒకరు. కరోనా సోకిన తులసీరామ్ హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన తనకు ఎంతో ఇష్టమైన సంతీతం వింటూ, నృత్యం చేస్తూ కాలం గడిపారు. ఈ వయసులో తులసీరామ్‌కు కరోనా సోకగానే వారి ఇంటిలోనివారు ఆందోళన పడ్డారు.

తులసీ రామ్ తాను ఆసుపత్రికి వెళ్లనని, ఇంటిలోనే చికిత్స తీసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అందుకు తగిన విధమైన ఏర్పాట్లు చేశారు. తులసీరామ్ ఆక్సిజన్ లెవెల్స్ తరచూ పరీక్షిస్తూ వచ్చారు. ఆయన తగిన విధంగా ఔషధాలు వాడటంతో కరోనాను జయించారు. కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చిన నేపధ్యంలో తులసీరామ్ మీడియాతో మాట్లాడుతూ తాను వందేళ్లు బతకాలనుకుంటున్నానని, తాను తనకు నచ్చిన ఆహారం తింటూనే..తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా మహమ్మారిని ఓడించానని సగర్వంగా తెలిపారు.