CAA కి మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉండి అక్కడ హింసకు గురై మనదేశం వచ్చిన సోదరులు ఇక్కడికి వస్తే వారికి హక్కులు కల్పించటంలో ఎలాంటిఅభ్యంతరం లేదని మధ్యప్రదేశ్..మాండసౌర్ లోని సువస్రా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్దీప్ సింగ్ దుంగ్ వ్యాఖ్యానించారు. వారికి ఇక్కడ పౌరసత్వం కల్పిస్తే వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఆయన అన్నారు.
కాగా…భారతదేశంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వారిని ఇప్పుడు వారి జాతీయత రుజువు చేసే పత్రాలను చూపించమని కోరితే అది తప్పు అని హర్దీప్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియామాలకు విరుధ్ధంగా హరిదీప్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్రప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పుడు కూడా ఆయన మద్దతు తెలిపారు. ఆర్టికల్ 30 ని రద్దుచేసినప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులుప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
సీఏఏ కు మద్దతుగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు వస్తున్న సమయంలో హర్దీప్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు మధ్యప్రదేశ్ లో సీఏఏను అమలు చేయబోమని సీఎం కమల్ నాధ్ ఇప్పటికే ప్రకటించారు.