రూ.200ల లీజు భూమిలో రైతుకు దొరికిన 14.98 క్యారెట్ల వజ్రం..ధర రూ.60 లక్షలు

MP farmer finds diamond worth rs. 60 lakh : అదృష్టవంతుడ్ని ఎవరూ పాడు చేయలేదు..దురదృష్టవంతుడ్ని ఎవరూ బాగు చేయలేరు అన్నట్లుగా కేవలం రూ.200లు పెట్టుబడి పెట్టి తీసుకున్న భూమిలో ఓ రైతుకు ఏకంగా 14.98 క్యారెట్ల వజ్రం దొరికింది. ఆ వజ్రం ధర రూ.60 లక్షలు. దీన్ని బట్టి తెలుస్తోంది కదూ..ఆ రైతు ఎంత అదృష్టవంతుడో..
వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని లఖన్ యాదవ్ అనే 45 ఏళ్ల రైతు రూ.200లు పెట్టుబడి పెట్టి భూమిని లీజుకు తీసుకున్నాడు. ఆ భూమిలో అతనికి లక్షల విలువైన వజ్రం దొరికింది. దాంతో కష్టల్లో ఉన్న ఆరైతుకు పండుగే అయ్యింది. ఇల్లంతా సంతోషంతో గంతులు వేస్తోంది. నా కష్టాలు తీర్చు దేవుడా అని మొక్కకున్న ఆ రైతుకు తెల్లారేసరికల్లా 14.98 క్యారెట్ల వజ్రం దొరకటంతో లక్షాధికారి అయిపోయాడు. ఆ వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో భవిష్యత్‌లో తన నలుగురు పిల్లల్ని చక్కగా చదివిస్తానంటున్నాడు లఖన్ యాదవ్.
కాగా లీజుకు తీసుకున్న భూమిలో కూరగాయాలు పండించి వ్యాపారం చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలో ఆ భూమిలో గత శనివారం (డిసెంబర్ 6,2020) విత్తనాలు నాటటానికి నేలను చదును చేస్తుండగా..ఓ చోట ధగధగా మెరుస్తున్న ఓ రాయి కనిపించింది. అదేమాని చేతిలోకి తీసుకున్నాడు. దానితో పాటు మరికొన్ని రంగురాళ్లు కూడా దొరికాయి. వాటిని జాగ్రత్తగా దాచిపెట్టాడు.
ఆ తరువాత తెలిసిన వారి ద్వారా శుభ్రం చేసే వారికి చూపించగా..వాటిలో ఉన్నది ఓ వజ్రం 14.98 క్యారెట్ల వజ్రంగా తెలిసింది. దాని ధర రూ.వెల్లడైంది. దాంతో దాన్ని అమ్మకానికి పెట్టగా లఖన్‌యాదవ్‌కు రూ.60.6 లక్షల సొమ్ము అందింది.
దీనిపై లఖన్ యాదవ్ మాట్లాడుతూ..గులకరాయితో పాటు భూమిలో దొరికిని ఆ వజ్రాన్ని కూడా సాధారణ రాయి అనుకున్నానని కానీ అది వజ్రం అని తెలిసాక నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోయానని సంతోషంగా ఉబ్బి తబ్బిబ్బు అయిపోతు తెలిపాడు. తనకు మంచి రోజులు వచ్చాయనీ..వజ్రం అమ్మగా వచ్చిన సొమ్ముతో తన నలుగురు పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తానంటున్నాడు.
పన్నా నేషనల్ పార్క్ ఏర్పాటు క్రమంలో పలు గ్రామాలను వేరే ప్రాంతాలకు తరలించడంతో లఖన్ యాదవ్ కుటుంబం ఇటీవలి కాలం వరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంది. పడరాని పాట్లు పడింది. పరిహారంగా అందిన డబ్బుతో రెండు హెక్టార్ల భూమితోపాటు రెండు గేదెలను కొనుకుని వాటిపైనే జీవిస్తున్నాడు.
ఈక్రమంలో అతనికి ఈ వజ్రం దొరకటంతో తెగ సంతోషపడిపోతున్నాడు. ఇక నా కష్టాలు గట్టెక్కినట్లేనంటున్నాడు. ఆ వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో వ్యాపారానికి ఉపయోగపడేలా ఒక బైక్‌ను కొంటానని చెబుతున్నాడు.