Radhika Merchant : అంబానీ కాబోయే కోడలి భరతనాట్య ప్రదర్శన.. సినీప్రముఖుల సందడి!

Radhika Merchant : అంబానీ ఫ్యామిలీ.. విలాసవంతమైన జీవితం.. అందులోనూ ముఖేశ్ అంబానీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఎంత లగ్జరీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.

Radhika Merchant : అంబానీ కాబోయే కోడలి భరతనాట్య ప్రదర్శన.. సినీప్రముఖుల సందడి!

Mukesh And Nita Ambani Host Radhika Merchant's Arangetram (1)

Updated On : June 6, 2022 / 9:01 AM IST

Radhika Merchant : అంబానీ ఫ్యామిలీ.. విలాసవంతమైన జీవితం.. అందులోనూ ముఖేశ్ అంబానీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఎంత లగ్జరీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాంటి అంబానీ ఫ్యామిలీలో కొత్త కోడలు రాబోతోంది. ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి కాబోయే శ్రీమతి రాధిక మర్చంట్.. అయితే ఇటీవలే ఈమె భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది. కాబోయే కోడలి భరతనాట్య ఆరంగేట్రం కోసం అంబానీ ఫ్యామిలీ కదిలి వచ్చింది. భరతనాట్య ప్రదర్శన కోసం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది.

Mukesh And Nita Ambani Host Radhika Merchant's Arangetram (3)

Mukesh And Nita Ambani Host Radhika Merchant’s Arangetram 

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జూన్ 5న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భరతనాట్య ప్రదర్శన కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంబానీ ఫ్యామిలీతో పాటు కాబోయే కోడలు రాధిక మర్చంట్ కుటుంబ సభ్యులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కు 2019లో నిశ్చితార్థమైంది. అయితే.. కొన్నాళ్లుగా భావన థాకర్‌ వద్ద రాధిక భరతనాట్యంలో శిష్యరికం చేసింది. భరతనాట్యం నేర్చుకున్న తర్వాత మొదటిసారిగా స్టేజీపై రాధిక నృత్యప్రదర్శన ఇచ్చారు.

Mukesh And Nita Ambani Host Radhika Merchant's Arangetram (2)

Mukesh And Nita Ambani Host Radhika Merchant’s Arangetram

తనదైన శైలిలో నవరసాలతో ప్రదర్శన ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు. కాబోయే కోడలు రాధికతో పాటు అత్త నీతా అంబానీకి కూడా భరతనాట్యంలో ప్రవేశం ఉంది.

Mukesh And Nita Ambani Host Radhika Merchant's Arangetram (5)

Mukesh And Nita Ambani Host Radhika Merchant’s Arangetram 

అందుకే ఈ కార్యక్రమానికి అంబానీ, మర్చంట్‌ కుటుంబ సభ్యులందరూ సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. ఈ కార్యక్రమంలో అంబానీ మనువడు పృథ్వీ అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. భరతనాట్య ప్రదర్శనకు హాజరైన వారిలో బాలీవుడ్ నటులు సల్మాన్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, రణవీర్‌ సింగ్‌ ఉన్నారు.

Mukesh And Nita Ambani Host Radhika Merchant's Arangetram (4)

Mukesh And Nita Ambani Host Radhika Merchant’s Arangetram

Read Also : Mukesh Ambani: ఆసియాలోనే ధనవంతుడిగా ముఖేష్ అంబానీ