ఇవే నా చివరి ఎన్నికలు…కన్నీళ్లు పెట్టుకున్న ములాయం

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.బీఎస్పీ అధినేత్రి మాయావతి,తన కుమారుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి మెయిర్ పురిలో ఎన్నికల ప్రచారంలో ములాయం పాల్గొన్నారు. ఈ సభతో పాతికేళ్ల తర్వాత బద్ధశత్రవులైన మాయా,ములాయం ఒకే వేదిక పంచుకున్నారు.
ఈ సందర్భంగా ములాయం సింగ్ మాట్లాడుతూ….చాలా ఏళ్లుగా మెయిన్‌పురి ప్రజలతో నాకు అనుబంధం ఏర్పడింది. ఇక్కడి ప్రజలు నా వాళ్లయిపోయారు. ఇవే నా చివరి ఎన్నికలు అని చెప్పడానికి మాటలు రావడం లేదు. ఈ ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. 2014 ఎన్నికల్లో కంటే మంచి మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాను. యువత కూడా నా వెంటే ఉంటారనుకుంటున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యారు.నన్ను మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తారు కదా.. అని ములాయం అడగ్గా అక్కడున్న ప్రజలందరూ అవును..ములాయం ఈ నేల తల్లి బిడ్డ అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ములాయంని పొగిడారు.ములాయం నిజమైన ఓబీసీ అన్నారు.మోడీలా ములాయం ఫేక్ ఓబీసీ కాదన్నారు.