మనుషులేనా : కుక్కపిల్ల తల నరికిపారేశారు

మనుషులేనా : కుక్కపిల్ల తల నరికిపారేశారు

Updated On : December 30, 2020 / 3:16 PM IST

Mumbai Puppy Beheaded : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. దహిసార్ ప్రాంతంలోని ఆనంద్‌నగర్‌ ప్రాంతంలోని జాిర మారి తోట సమీపంలో ఆదివారం (డిసెంబర్79,2020) ఓ చిన్న కుక్కపిల్ల మొండెం తల నరికేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మొండెం నుంచి వేరైన ఓబుజ్జి కుక్క పిల్ల మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు.

ఈ విషయం తెలిసిన ముంబై ఆనిమల్ అసోసియేషన్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే..కుక్కు పిల్లను తొలుత చంపి ఆపై మొండెం నుంచి తల వేరు చేసి ఉంటారని వారు భావిస్తున్నారు.

ఆనిమల్ అసోసియేషన్ సభ్యుల ఫిర్యాదు మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పదునైన ఆయుధంతో కుక్కపిల్ల నరికివేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం కుక్కపిల్ల మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పరేల్‌లోని బీఎస్పీసీఏ జంతు ఆసుపత్రికి తరలించారు.

భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్లు 429 (పశువులను చంపడం లేదా దుర్వినియోగం చేయడం దుర్మార్గం) జంతువుల క్రూరత్వాన్ని నిరోధించే చట్టంకింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.