Mumbai : 30 వేల మందికి టీకాలు..గిన్నీస్ రికార్డ్

దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో 30 వేల మందికిపైగా వ్యాక్సిన్ వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిందో ఓ ఆసుపత్రి.

Mumbai : 30 వేల మందికి టీకాలు..గిన్నీస్ రికార్డ్

Mumbai

Updated On : August 21, 2021 / 1:56 PM IST

Mumbai Hospital : కరోనా మహమ్మారి ఇంకా వీడడం లేదు. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కొంత తగ్గుముఖం పట్టినా..కేసులు మాత్రం ఇంకా నమోదవుతున్నాయి. వైరస్ నుంచి రక్షించుకోవడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం జోరుగా కొనసాగిస్తోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో 30 వేల మందికిపైగా వ్యాక్సిన్ వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిందో ఓ ఆసుపత్రి.

Read More : Kidney Beans : గిదేం పిచ్చి, ఆ భాగంలో బీన్స్ ఇరికించుకున్నాడు…ఆసుపత్రికి పరుగు

ICICI Lombard సహకారంతో…Surana Sethia Hospital & Research Centre ఆసుపత్రి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. ఆగస్టు 07వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 30 వేల 467 మంది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న వారందరూ…ధారావి, వర్లి మురికివాడల్లో నివాసం ఉంటున్నారు. అక్కడనే వారికి టీకాలు వేశారు. కరోనా వారియర్స్, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితో మొత్తం 60 మంది టీకా కేంద్రాల్లో వారం రోజుల పాటు పని చేసి ఈ ఘనత సాధించారు.

Read More : Megastar Chiranjeevi : వావ్.. మెగా టైటిల్స్ మామూలుగా లేవుగా..!

ఆగస్టు 07వ తేదీ ఉదయం 9 గంటలకు వ్యాక్సినేషన్ వేయడం ప్రారంభించారు. అక్కడకు చేరుకున్న గిన్నీస్ నిర్వాహకులు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 04గంటల వరకు వ్యాక్సినేషన్ వేశారు. ఈ విషయంపై Dr Prince Surana (CEO, Surana Sethia Hospital) మాట్లాడుతూ…మొత్తం డ్రైవ్ లో సురానా ఆసుపత్రి నుంచి 60 మంది నర్సులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారని వెల్లడించారు.

Read More : Mohammad Abbas: భారత మిలిట్రీఅకాడ‌మీలో ట్రైనింగ్ పొందిన అఫ్ఘన్‌ తాలిబన్‌ అగ్రనేత

వీరు సగటున ప్రతి రోజు రెండు ప్రాంతాల్లో 3 వేల మందికి టీకాలు వేశారని తెలిపారు. వ్యాక్సినేషన్ వేసుకున్న వారి వివరాలు నమోదు చేయడం జరిగిందని, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతాయన్నారు. టీకా డ్రైవ్ ను మొత్తం 14 రోజుల పాటు కొనసాగించి…50 వేల మందికి ఉచితంగా వ్యాక్సినేషన్ వేశామన్నారు. కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం మేరకు…దేశంలో మొత్తం వ్యాక్సిన్ వేసుకున్ వారి సంఖ్య 57.16 కోట్లుగా ఉంది.