Biren Singh : మణిపూర్ సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్ బీరెన్ సింగ్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అందరూ ఇది ఏకగ్రీవంగా తీసుకున్న మంచి నిర్ణయం అన్నారు. మణిపూర్‌లో స్థిరమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండడానికి నిదర్శనమని తెలిపారు.

Biren Singh : మణిపూర్ సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్ బీరెన్ సింగ్

Manipur

Updated On : March 20, 2022 / 8:14 PM IST

Manipur CM N.Biren Singh : మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ బీరెన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం(మార్చి20, 2022) ఇంఫాల్‌లో జరిగిన మణిపూర్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ను కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, కిరెన్ రిజిజు అభినందించారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అందరూ ఇది ఏకగ్రీవంగా తీసుకున్న మంచి నిర్ణయం అన్నారు. మణిపూర్‌లో స్థిరమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండడానికి నిదర్శనమని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు.