Nagaland Polls: రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు.. నాగాలాండ్ సంపద లూటీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం: మల్లికార్జున ఖర్గే

నాగాలాండ్, దిఫూపర్‌లో మంగళవారం జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేర్చే హామీల గురించి వివరించారు. ‘‘రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై దాడి జరుగుతోంది. ప్రజల్ని కులాలు, మతాలవారీగా విడగొడుతున్నారు.

Nagaland Polls: రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు.. నాగాలాండ్ సంపద లూటీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం: మల్లికార్జున ఖర్గే

Updated On : February 21, 2023 / 6:51 PM IST

Nagaland Polls: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార బీజేపీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలోని సంపదను బీజేపీ కొల్లగొడుతోందని ఖర్గే విమర్శించారు.

Anonymous Donor: చిన్నారికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.11 కోట్లు దానం చేసిన గుర్తు తెలియని వ్యక్తి

నాగాలాండ్, దిఫూపర్‌లో మంగళవారం జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేర్చే హామీల గురించి వివరించారు. ‘‘రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై దాడి జరుగుతోంది. ప్రజల్ని కులాలు, మతాలవారీగా విడగొడుతున్నారు. గత 20 ఏళ్లుగా ఎన్డీపీపీ, ఎన్పీఎఫ్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నాయి. ధనవంతులు మాత్రమే ఇంకా ధనవంతులు అవుతున్నారు. ప్రజలకు న్యాయం చేసే, ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులకు వంద శాతం ఉపాధి కల్పిస్తూ, వేతనాలు అందజేస్తాం.

TDP Pattabhi Ram: గన్నవరం కోర్టుకు టీడీపీ నేత పట్టాభి.. కోర్టుకు తరలిస్తుండగా టీడీపీ నేతల ఆందోళన, ఉద్రిక్తత

ఉన్నత విద్య చదవాలనుకునే వాళ్లకు సున్నా వడ్డీతో రుణాలిస్తాం. స్వచ్ఛమైన తాగునీళ్లు, పారిశుధ్యం వంటి సౌకర్యాలు కల్పిస్తాం’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్‌లో ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలు వెలువడుతాయి. అక్కడ బీజేపీ, ఎన్డీపీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది.