9PM TO 5AM…మహిళలకు ఫ్రీ రైడ్ : ప్రారంభించిన నాగ్ పూర్ పోలీసులు

  • Published By: venkaiahnaidu ,Published On : December 4, 2019 / 12:49 PM IST
9PM TO 5AM…మహిళలకు ఫ్రీ రైడ్ : ప్రారంభించిన నాగ్ పూర్ పోలీసులు

Updated On : December 4, 2019 / 12:49 PM IST

దేశంలో రోజురోజుకీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాగ్ పూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టే విధంగా ఫ్రీ రైడ్ స్కీమ్ ను బుధవారం(డిసెంబర్-4,2019)నాగ్ పూర్ పోలీసులు లాంఛ్ చేశారు.

ఫ్రీ రైడ్ కోసం మహిళలు 100 లేదా 1091 లేదా 07122561103 నెంబర్లకు కాల్ చేసి వెహికల్ కోసం రిక్వస్ట్ చేయవచ్చని నాగ్ పూర్ సిటీ పోలీస్ ట్వీట్ లో తెలిపారు. కంట్రల్ రూమ్ వాహనం కానీ,దగ్గర్లోని పీసీఆర్ వాహనం కానీ,ఎస్ హెచ్ ఓ వాహనం కానీ మహిళలను పిక్ చేసుకుని,వారు దిగాలనుకున్న చోట సేఫ్ గా దించుతారని ఆ ట్వీట్ లో తెలిపారు.

మరోవైపు పంజాబ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టనున్నట్టు సీఎం అమరీందర్‌ సింగ్‌ మంగళవారం(డిసెంబర్-3,2019) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సీఎం ప్రకటించారు.