Metro Services: అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు.. కొత్త సంవత్సర వేడుకల కోసం సేవల పొడిగింపు

ప్రతి మెట్రో టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి ట్రైన్ అర్థరాత్రి 01.15 నుంచి 01.30 మధ్య బయలుదేరుతుందని, చివరి స్టేషన్‌కు అర్థరాత్రి రెండు గంటల వరకు చేరుకుంటుందని నమ్మ మెట్రో ఎండీ అంజుమ్ పర్వేజ్ తెలిపారు.

Metro Services: అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు.. కొత్త సంవత్సర వేడుకల కోసం సేవల పొడిగింపు

Updated On : December 29, 2022 / 7:51 PM IST

Metro Services: కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడపాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎమ్ఆర్‌సీఎల్) సంస్థ నిర్ణయించింది. ‘నమ్మ మెట్రో’ సేవలు అర్ధరాత్రి రెండు గంటల వరకు కొనసాగుతాయని బీఎమ్ఆర్‌సీఎల్ తెలిపింది.

Election Commission: ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు.. రిమోట్ ఈవీఎం మెషీన్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల సంఘం

బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పబ్బులు, రెస్టారెంట్స్ వంటివి అర్థరాత్రి ఒంటి గంట వరకు కొనసాగుతాయి. ప్రతి మెట్రో టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి ట్రైన్ అర్థరాత్రి 01.15 నుంచి 01.30 మధ్య బయలుదేరుతుందని, చివరి స్టేషన్‌కు అర్థరాత్రి రెండు గంటల వరకు చేరుకుంటుందని నమ్మ మెట్రో ఎండీ అంజుమ్ పర్వేజ్ తెలిపారు. నగరంలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతించిన నేపథ్యంలో, మెట్రో సేవల్ని రెండు గంటల వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Group 2 Notification: గ్రూప్-2 నోటిఫికేష్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ.. 783 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

అమ్మాయిల్ని వేధింపులకు గురిచేయడం, డ్రగ్స్ సరఫరా, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటివి జరగకుండా చూస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఇలాంటి ఘటనలు జరిగితే, నిందితుల్ని గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మహిళలు, పిల్లల భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.