National Pension System New Rule : పెన్షన్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త రూల్
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాదారులకు అలర్ట్. 2023 జనవరి 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. వివరాల్లోకి వెళితే.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో పలు మార్పులు చేస్తూ పీఎఫ్ఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.

National Pension System New Rule : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాదారులకు అలర్ట్. 2023 జనవరి 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. వివరాల్లోకి వెళితే.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో పలు మార్పులు చేస్తూ పీఎఫ్ఆర్డీఏ (Pension Fund Regulatory and Development Authority-PFRDA) నిర్ణయం తీసుకుంది.
ఎన్ పీఎస్ చందాదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఆన్ లైన్ లో పాక్షికంగా డబ్బు తీసుకునే అవకాశాన్ని తొలగించింది. కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు ఉండటంతో.. జనవరి 1 నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తో పాక్షిక ఉపసంహరణ చేసుకునే ఛాన్స్ నిలిచిపోతుంది. మూడేళ్ల ఎన్ పీఎస్ చందాదారులు.. డాక్యుమెంట్లు సమర్పించి, కంట్రిబ్యూషన్ లో 25శాతం లోపు డబ్బు డ్రా చేసుకోవచ్చు.
Also Read..ప్రాసెస్ ఇదిగో : మీ PF అకౌంట్‌లో E-nomination చేయండిలా?
”నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఉపసంహరణకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఇటీవల కొత్త ఆర్డర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ రంగాల చందాదారులు తమ అనుబంధ నోడల్ కార్యాలయాల ద్వారా పాక్షిక ఉపసంహరణ కోసం దరఖాస్తును సమర్పించాలి. ఇందులో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర/రాష్ట్ర స్వయంప్రతిపత్తి సంస్థల చందాదారులు ఉన్నారు. ఇది జనవరి 1, 2023 నుండి వర్తిస్తుంది” అని అధికారులు వెల్లడించారు.
Also Read..PF Balance : మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు..!
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారులుగా ఉన్న సమాఖ్య, రాష్ట్ర మరియు కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు ఇకపై స్వీయ ప్రకటన ద్వారా తమ NPS ఖాతాల నుండి పాక్షికంగా నిధులను విత్‌డ్రా చేయలేరు. పబ్లిక్ సెక్టార్‌లోని చందాదారులు ఇప్పుడు సంబంధిత నోడల్ ఏజెన్సీల ద్వారా పాక్షిక ఉపసంహరణల కోసం తమ అభ్యర్థనలను సమర్పించాలి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
కాగా.. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వ రంగ చందాదారులు ఎన్‌పిఎస్ ఖాతాల నుండి పాక్షిక ఉపసంహరణలను స్వీయ ప్రకటన(సెల్ఫ్ డిక్లరేషన్) ద్వారా పెన్షన్ ఫండ్ అథారిటీ అనుమతించింది. అయితే, ఇప్పుడు కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని తొలగించారు అధికారులు.