Himanshi Narwal : దాడులు ఆపొద్దు- ఆపరేషన్ సిందూర్ పై లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య కీలక వ్యాఖ్యలు..

ఈ ఆపరేషన్ భారత్ లో ఉగ్రవాదం అంతానికి నాంది అని ఆమె అన్నారు.

Himanshi Narwal : దాడులు ఆపొద్దు- ఆపరేషన్ సిందూర్ పై లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య కీలక వ్యాఖ్యలు..

Updated On : May 7, 2025 / 9:40 PM IST

Himanshi Narwal : జమ్ముకశ్మీర్ లో పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ముష్కరుల దాడిలో మృతి చెందిన వారిలో ఒకరు నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది.

ఆపరేషన్ సిందూర్ పై వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్.. ఆపరేషన్ సిందూర్ పై స్పందించారు. ఈ ఆపరేషన్ భారత్ లో ఉగ్రవాదం అంతానికి నాంది అని ఆమె అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే తన భర్త ఉద్యమ స్ఫూర్తిని ఆపరేషన్ సిందూర్ చాటిందన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఉగ్రమూకలపై దాడులు ఆపొద్దని, వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకూ దాడులు జరపాలని ప్రధాని మోదీని కోరారు హిమాన్షి నర్వాల్.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్, భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను స్వాగతించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను ముగించవద్దని కోరారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు ఆపరేషన్ కొనసాగించాలన్నారు.

నా భర్త రక్షణ దళాలలో ఉన్నారు. ఆయ శాంతిని కాపాడాలని, అమాయకుల ప్రాణాలను కాపాడాలని కోరుకున్నారు. ఈ దేశంలో ద్వేషం, ఉగ్రవాదం ఉండకూడదని కోరుకున్నారు. నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ దాడులను ఇక్కడితో ముగించొద్దని నేను అభ్యర్థిస్తున్నా. ఇది మన దేశంలో ఉగ్రవాదం అంతానికి ప్రారంభం మాత్రమే అని వారు నిర్ధారించుకోవాలని నేను కోరుకుంటున్నా” అని హిమాన్షి నర్వాల్ అన్నారు.

Also Read: ఆపరేషన్ సిందూర్ పై కేంద్రం ప్రెస్‌మీట్‌లో ఉన్న ఈ ఇద్దరు మహిళలు మామూలోళ్లు కాదు.. వాళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే..

ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు వివాహం చేసుకున్న వినయ్ నర్వాల్ జంట తమ హనీమూన్ కోసం కశ్మీర్‌కు వెళ్లారు. ఉగ్రదాడిలో 26 ఏళ్ల నేవీ అధికారి వినయ్ తో పాటు 25 మంది మరణించారు. తన భర్త మృతదేహం పక్కనే హిమాన్షి నర్వాల్ కూర్చుని రోదించిన హృదయ విదారక దృశ్యాలు యావత్ దేశాన్ని కదిలించాయి.