బిహార్‌లో ఎన్డీఏ సునామీ.. మూడింట రెండొంతుల సీట్ల దిశగా..
వార్ వన్ సైడ్ అయిపోయింది. మహాఘట్‌బంధన్ చతికిలపడిపోయింది.
బిహార్‌లో ఎన్డీఏ సునామీ సృష్టిస్తోంది. మూడింట రెండొంతుల సీట్ల దిశగా దూసుకెళుతోంది. ఎన్డీఏ 190, మహాఘట్‌బంధన్ 50 సీట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు కేవలం 3 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నారు. దీంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. మహాఘట్‌బంధన్ చతికిలపడిపోయింది.
బిహార్ ఎన్నికలు-2020లో ఎన్డీఏ 122 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 74, జనతా దళ్ (యునైటెడ్) 43, వికాస్‌శీల ఇన్సాన్ పార్టీ, హిందుస్థానీ అవామ్ మోర్చా తలా 4 స్థానాలు గెలిచాయి. ఈ పార్టీలన్నీ ఎన్డీఏలోవే.
Jubilee hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ లైవ్ అప్డేట్స్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ
మహాఘట్‌బంధన్‌కు 114 సీట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్‌లోని రాష్ట్రీయ జనతా దళ్ 75 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ ఎవరికీ అందనంత స్పీడుతో దూసుకువెళుతోంది.
ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఈ సారి దాదాపు అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏనే గెలుస్తుందని చెప్పాయి. అదే దిశగా ఎన్డీఏ నేతలు విజయం సాధిస్తున్నారు. అంచనాలను మించే ఎన్డీఏ దూసుకుపోతోంది.
