Jubilee hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ లైవ్ అప్డేట్స్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ

Jubilee hills Bypoll: తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం కాసేపట్లో తేలనుంది. ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది.

Jubilee hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ లైవ్ అప్డేట్స్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ

Jubilee Hills Bypoll 2025

Updated On : November 14, 2025 / 9:45 AM IST

Jubilee hills Bypoll: తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం కాసేపట్లో తేలనుంది. ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది. యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు అధికారులు.

ఈ ఉపఎన్నికలో 58మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్టేడియంలో ఒక వరుసకు 21టేబుళ్ల చొప్పున.. రెండు వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యే వరకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు.

రౌండ్, డివిజన్లు, పోలింగ్ బూత్ నెంబర్లు..
♦ షేక్‌పేట్ 1-422.
♦ షేక్‌పేట్, ఎర్రగడ్డ – 43-853.
♦ రహ్మత్ నగర్, వెంగళ రావునగర్ 86-128.
♦ వెళరావునగర్, రహ్మత్ నగర్ 129-171.
♦ రహ్మత్ నగర్, వెంగళరావునగర్ 172-214.
♦ వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ 215-257.
♦ యూసుఫ్ గూడ, సోమాజిగూడ 258-300.
♦ సోమాజిగూడ , ఎర్రగడ్డ, బోరబండ 301-343.
♦ బోరబండ, ఎర్రగడ్డ 344-386.
♦ ఎర్రగడ్డ 387-407

పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు 47, బీఆర్ఎస్‌కు 43, బీజేపీకి 11 ఓట్లు వచ్చాయి.

మొదటి రౌండ్‌ ఫలితాలు..
మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ 47ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.
కాంగ్రెస్ పార్టీకి 8,911 ఓట్లు
టీఆర్ఎస్ పార్టీకి 8,864 ఓట్లు,
బీజేపీకి 2,167 ఓట్లు వచ్చాయి.

రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌దే ఆధిక్యంలో ఉంది.