Women Complaints : 2021 ఏడాదిలో దేశంలో మహిళలపై 30శాతం పెరిగిన దాడులు..!
దేశంలో మహిళలపై దాడులు ఆగడం లేదు. ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా మహిళలపై నేరాలకు అంతులేకుండా పోతోంది. ఏడాదికి ఏడాదికి మహిళలపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది.

Nearly 30 Percent Complaints Of Crimes Against Women Received In 2021, Over Half From U.p. Ncw
Complaints of crimes against women : దేశంలో మహిళలపై దాడులు ఆగడం లేదు. ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా మహిళలపై నేరాలకు అంతులేకుండా పోతోంది. మహిళలపై దాడులను నియంత్రించేందుకు దిశ వంటి పవర్ ఫుల్ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ యువతలు, బాలికలపై అరాచకాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. మహిళల పట్ల ప్రత్యేకమైన భద్రతా చర్యలను ప్రభుత్వం చేపట్టినప్పటికీ దాడులు పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా బాలికలపై లైంగిక హింస వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. బాలికలపై లైంగిక దాడులకు పోస్కో వంటి కఠినమైన చట్టాలు ఉన్నా లైంగిక దాడులు పెచ్చుమీరుతునే ఉన్నాయి.
ఏడాదికి ఏడాదికి మహిళల దాడులు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. మహిళలపై దాడులకు సంబంధించి జాతీయ మహిళా కమీషన్ ఓ వార్షిక నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2020 ఏడాదిలో మహిళలపై జరిగిన నేరాలతో పోలిస్తే.. 2021 ఏడాదిలోనూ 30శాతం వరకు దాడులు పెరిగాయి. 2021లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి జాతీయ మహిళా కమీషన్‌కు 30864 ఫిర్యాదులు అందాయి.
ఒక్క ఉత్తర్ ప్రదేశ్ నుంచే జాతీయ మహిళా కమీషన్‌కు 15828 ఫిర్యాదులు అందినట్టు నివేదిక తెలిపింది. 2014 తర్వాత NCW ఎన్సీడబ్ల్యూకు అత్యాధిక స్థాయిలో ఫిర్యాదులు అందడం ఇప్పుడేనని పేర్కొంది. మానసిక వేధింపులకు సంబంధించి 11 వేల ఫిర్యాదులు అందగా.. గృహ హింస కింద 6,633 ఫిర్యాదులు, వరకట్న వేధింపులపై 4,589 ఫిర్యాదులు అందించినట్టు జాతీయ మహిళా కమీషన్ వెల్లడించింది. ఢిల్లీ నుంచి 3,336, మహారాష్ట్ర నుంచి 1504, హరియాణా, బిహార్ నుంచి 14 వందలకు పైగా ఫిర్యాదులు అందినట్లు జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.
మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించేలా వారిలో చైతన్యం కల్పిస్తుండటం వల్లే ఈ ఏడాది ఫిర్యాదుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలిపిన జాతీయ మహిళా కమీషన్ ఛైర్మన్ రేఖా శర్మ పేర్కొన్నారు. బాధిత మహిళలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రేఖా శర్మ తెలిపారు.
Read Also : RRR Postpone: వాయిదా పడిన ఆర్ఆర్ఆర్.. మేకర్స్ అధికారిక ప్రకటన!