PM Modi : కోర్టుల్లో స్థానిక భాషల ఉపయోగంపై మోదీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు జరిగింది. ఆ సదస్సును మోదీ ప్రారంభించి ప్రసంగించారు. పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా...

PM Modi : కోర్టుల్లో స్థానిక భాషల ఉపయోగంపై మోదీ కీలక వ్యాఖ్యలు

Modi

Local Languages In Courts : భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు, హైకోర్టులో జరుగుతున్న వ్యవహారాలు స్థానిక భాషల్లో జరగాలనే చర్చ కొనసాగుతోంది. హైకోర్టుల్లో స్థానిక భాషల ప్రవేశపెట్టడంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం దీనిపై స్పందించారు. ప్రస్తుతం ఇంగ్లీషుల్లోనే జరుగుతున్నాయని.. ప్రాంతీయ భాషల్లో కూడా జరగాలని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలకు చేరువయ్యేలా వ్యవస్థను సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని, న్యాయ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తనవంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా చేయడం వల్ల దేశంలోని సాధారణ పౌరులకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.

Read More : PM Modi : ప్రధాని మోదీ ర్యాలీ ప్రాంతంలో ఆర్డీఎక్స్ కలకలం.. ఉగ్రవాదుల పనేనా?

2022, ఏప్రిల్ 30వ తేదీ శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు జరిగింది. ఆ సదస్సును మోదీ ప్రారంభించి ప్రసంగించారు. పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ నిర్ణయాలు తీసుకొనడం జరుగుతున్నట్లు.. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో న్యాయ వ్యవస్థ – కార్య నిర్వాహక వ్యవస్థ ఈ రెండు పాత్రలు రాజ్యాంగం బాధ్యతలను ఆకాంక్షలను చాటి చెప్పిందని తెలిపారు. భారతదేశంలోని ఆకాంక్షలను నెరవేర్చేలా న్యాయవ్యవస్థను ఎలా సమర్థవంతంగా మార్చుకోవాలనే దానిపై చర్చ జరగాలని వెల్లడించారు. 2015లో అసంబద్ధంగా మారిన 1800 చట్టాలను తమ ప్రభుత్వం గుర్తించడం జరిగినట్లు.. అందులో 1450 చట్టాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. అయితే.. రాష్ట్రాలు మాత్రం 75 చట్టాలను రద్దు చేశాయన్నారు. దేశంలో 3.5 లక్షల మంది ఖైదీలు విచారణలో భాగంగా జైలులో ఉన్నారని.. వీరిలో ఎక్కువ మంది పేద, సాధారణ కుటుంబాలకు చెందిన వారన్నారు.

Read More : PM Modi : పెట్రోల్ ధరలు పెరుగుదల.. రాష్ట్ర ప్రభుత్వాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

ఈ కేసులను సమీక్షించేందుకు జిల్లా జడ్జీ నేతృత్వంలో కమిటీ ఉందదని.. వీలైన చోట బెయిల్ పై విడుదల చేయొచ్చన్నారు. ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు తాను విజ్ఞప్తి చేయడం జరుగుతోందన్నారు. కోర్టుల్లో.. స్థానిక న్యాయస్థాయిలో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఒక ముఖ్య సాధనంగా పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించుకొనేందుకు వేల ఏళ్లుగా మధ్యవర్తిత్వం అనే సంప్రదాయం ఉందన్నారు. న్యాయ వ్యవస్థలో సాంకేతికత అవకాశాలను భారత ప్రభుత్వం పరిశీలించడం జరుగుతోందని.. ఈ – కోర్టుల ప్రాజెక్టు నేడు మిషన్ మోడ్ లలో అమలు చేస్తున్నట్లు, డిజిటల్ లావాదేవీలే ఇందుకు నిదర్శమన్నారు. గత సంవత్సరం ప్రపంచంలో జరిగిన డిజిటిల్ లావాదేవీల్లో 40 శాతం భారతదేశంలోనే జరిగాయనే విషయాన్ని ప్రధాని మోదీ సదస్సుకు తెలిపారు.