నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీపై విచారణ.. పేపర్ లీక్ జరిగిందనేది స్పష్టమైందన్న సుప్రీంకోర్టు

పేపర్ ఎవరు తయారు చేశారు? ఆయా కేంద్రాలకు ఎలా పంపారు? అన్న విషయాలు..

నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీపై విచారణ.. పేపర్ లీక్ జరిగిందనేది స్పష్టమైందన్న సుప్రీంకోర్టు

Supreme Court

దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నీట్‌లో అవకతవకలు జరిగాయంటూ, దాన్ని రద్దు చేయాలంటూ మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ నెల 10లోపు మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. నీట్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టుని సబ్మిట్ చేయాలని సీబీఐని ఆదేశించింది. పేపర్ లీక్ జరిగింది అనేది స్పష్టమైందని చెప్పింది. అయితే, లీక్ అయిన పేపర్ ఎవరెవరికి వెళ్లిందనేది తెలుసుకోవాలని చెప్పింది.

పాట్నాలో పేపర్ లీక్ అయిందని క్లియర్‌గా తెలుస్తోందని తెలిపింది. పేపర్ ఎవరు తయారు చేశారు? ఆయా కేంద్రాలకు ఎలా పంపారు? అనే విషయాలు చెప్పాలని ఎన్టీఏను ఆదేశించింది. ఏదో ఒక్క చోట పేపర్ లీక్ అయితే మొత్తం నీట్‍‌ని రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. లీకేజీ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులను గుర్తించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగింది. పాట్నాలో మాత్రమే పేపర్ మాల్ ప్రాక్టీస్ జరిగిందని సొలిసిటర్ జనరల్ తెలిపారు.

Also Read: కొడాలి నానిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు