కొత్త యూజర్లకు రూ.5కే Netflix సబ్‌స్క్రిప్షన్

కొత్త యూజర్లకు రూ.5కే Netflix సబ్‌స్క్రిప్షన్

Netflix

Updated On : February 25, 2020 / 2:33 AM IST

నెం.1 OTT సర్వీస్ ప్రొవైడర్ Netflix న్యూ సబ్‌స్క్రిప్షన్‌లో కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. అతి తక్కువ ధర కేవలం రూ.5కే సేవలు అందిస్తుంది. ఇండియాలో అత్యధిక ధరకు అందుబాటులో ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఈ ఆఫర్‌తో ఇండియన్ యూజర్లకు దగ్గర అవ్వాలని చూస్తుంది. తొలి నెల సేవలను కేవలం రూ.5కే అందించడాన్ని త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. 

మార్కెటింగ్ ప్రమోషన్ లో ఇది కొత్త పద్ధతి. నెట్‌ఫ్లిక్స్ గురించి అందరికీ తెలియాలని ఇలా చేశాం. దీన్ని మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాం. గతంలో ఫస్ట్ నెల ఫ్రీగా ఇచ్చే సర్వీసును ఇప్పుడు రూ.5కు పెంచినా తగ్గించినట్లే చెబుతున్నారు. ధర తగ్గించడంతో భారత మార్కెట్ నుంచి రూ.3వేల కోట్ల పెట్టుబడులు ఆశిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హ్యాస్టింగ్స్ అన్నారు. 

గతేడాది నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యూజర్లకు నెలకు రూ.199 సబ్‌స్క్రిప్షన్, ఇతర నెట్‌ఫ్లిక్స్ డివైజ్ యూజర్లకు రూ.499(స్క్రీన్, SD రిసొల్యూషన్), రూ.649కు స్టాండర్డ్ ప్లాన్ (2స్క్రీన్లు, HD),  రూ.799కే ప్రీమియర్ ప్లాన్(4స్క్రీన్లు, 4కే  UHD, HD or SD). ట్రయల్ ఆఫర్లో నెట్‌ఫ్లిక్స్ ఎటువంటి నిబంధనలు లేకుండా అన్ని సర్వీసులు ఇస్తుంది. టీవీ షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు. 

మొదటి నెల పూర్తి అయిన తర్వాత ఎంచుకున్న ఛాయీస్‌ను బట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌కు ఇండియన్ మార్కెట్లో విపరీతమైన కాంపిటీషన్ ఎదురవుతోంది. మార్చి 29 నుంచి డిస్నీ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ వస్తుండటంతో నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటి నుంచే వణుకు మొదలైంది. డిస్నీ ప్లస్.. హాట్ స్టార్‌తో ఒప్పందం చేసుకుని సంవత్సరానికి రూ.1500కే అందుబాటులోకి వస్తుంది. 

See Also>>ఆన్‌లైన్ గేమింగ్ బిజినెస్‌లోకి ఆసియా రిచెస్ట్ మ్యాన్