ఉల్లిపాయ తినను..పరిస్థితి గురించి తెలియదు :కేంద్రమంత్రి చౌబే

తాను ఎక్కువగా ఉల్లిపాయలు తినే కుటుంబం నుంచి రాలేదు అని,అందువల్ల బాధపడాల్సిన పనిలేదు అని బుధవారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్న సమయంలో మరో కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
నిర్మలా వ్యాఖ్యలకు మద్దతుగా ఇవాళ(డిసెంబర్-5,2019)కేంద్రమంత్రి అశ్వినీ చౌబే మాట్లాడుతూ….తాను శాకాహారినని,తానెప్పుడూ ఉల్లిపాయలు తినలేదని,కాబట్టి మార్కెట్ లో ఉల్లి ధరల పరిస్థితి గురించి తనకెలా తెలుస్తుందని ఆయన అన్నారు. నిర్మలా వ్యాఖ్యల గురించి ఆయనను మీడియా అడగగా…ఉల్లి రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో ఆర్థికశాఖ మంత్రి క్లియర్ గా సమాధానం చెప్పారని చౌబే అన్నారు.
106రోజుల తీహార్ జైలు జీవితం తర్వాత ఇవాళ పార్లమెంట్ కు హాజరైన చిదంబరం…నిర్మలా సీతారాన్ ఉల్లిపాయ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. ఉల్లిపాయ తినని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు.ఆవిడ ఆవకాడో తింటారా అని చిదంబరం ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని,ఇప్పుడు ఉల్లి దిగుమతి చేసుకోవడంలో అర్థమేంటని చిదంబరం అన్నారు. తాను ఉల్లిపాయ తినను అని ఆర్థికమంత్రి చెప్పడం ప్రభుత్వం మైండ్ సెట్ ను తెలియజేస్తుందని ఆయన అన్నారు.
#WATCH “I am a vegetarian. I have never tasted an onion. So, how will a person like me know about the situation (market prices) of onions,” says Union Minister Ashwini Choubey pic.twitter.com/cubekfUrYW
— ANI (@ANI) December 5, 2019