వాహనదారులు జరభద్రం : అమల్లోకి మోటార్ వాహనాల చట్టం

  • Published By: madhu ,Published On : September 1, 2019 / 01:14 AM IST
వాహనదారులు జరభద్రం : అమల్లోకి మోటార్ వాహనాల చట్టం

Updated On : May 28, 2020 / 3:44 PM IST

రోడ్లపై సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడానికి మోటారు వాహనాల చట్ట సవరణకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అమలులో ఉన్న వెహికల్ చట్టంలో కొన్ని మార్పులు తెచ్చింది. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం నుంచి సరికొత్త చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటికే కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంట్‌లో ఈ బిల్లు పాసవ్వడంతో వాహనదారులకు విధించే జరిమానాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి.

జరిమానాలను పెంచడం ద్వారా అయినా వాహనాలను డ్రైవ్ చేసే వారి అలవాట్లలో మార్పు తీసుకురావొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదివరకు డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో మాట్లాడం లేదా సిగ్నల్ లైట్ జంపింగ్ చేస్తే.. ఓ మోస్తారు జరిమానాలను విధించేవారు ట్రాఫిక్ పోలీసులు. కానీ ఎక్కువగా వీటి వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇకపై మాత్రం రూల్ప్ అతిక్రమించే వారికి వేల రూపాయల్లో ఫైన్ విధించనున్నారు. 

నూతన వాహన చట్టంలో ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టూ వీలర్ రైడర్స్ అసోసియేషన్ కన్వీనర్ మహ్మద్ అహ్మదుల్లా ఖాన్ ప్రకటించారు. కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో… ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బ్లాక్ డేను నిర్వహించనున్నట్లు చెప్పారు. మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించిన తర్వాతే కొత్త నిబంధనలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొత్త నిబంధనలపై తర్వలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. 

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రూ. 500 – 10, 000 వరకు జరిమాన. ఆరు నెలల పాటు జైలు శిక్ష. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ఛాన్స్. 
ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలు హెల్మెట్ ధరించాలి.
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ. 1000 జరిమాన.
నిర్ణీత వేగం కంటే ఎక్కువ వేగంతో వెళితే..రూ. 1000 – 2000 వరకు జరిమాన.
అంబులెన్స్, ఫైరింజన్లకు దారివ్వకపోతే..రూ. 10 వేలు జరిమాన
ఎక్కువ మంది ప్రయాణీకులు ఎక్కించుకొనే వాహనాలకు ఒక్కో ప్రయాణీకుడిపై రూ. 200 జరిమాన.
సీటు బెల్టు ధరించని డ్రైవర్లకు రూ. 1000 జరిమాన.
Read More : రోడ్డుపై బైక్ డాన్స్ లేస్తే…జీతాలు, ఆస్తులు అమ్ముకోవాలి