New Parliament Building : ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొత్త పార్లమెంట్ భవనం .. 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..

 భారత ప్రజాస్వామ్య చరిత్రలో అపురూప ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది.

New Parliament Building : ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొత్త పార్లమెంట్ భవనం .. 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..

New Parliament Building

Updated On : May 16, 2023 / 4:40 PM IST

New Parliament Building :  భారత ప్రజాస్వామ్య చరిత్రలో అపురూప ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది. మే 28(2023)న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. 2020డిసెంబర్ లో సెంట్రల్ విస్తటకు భూమి పూజ చేశారు ప్రధాని మోదీ. రెండున్నరేళ్లలోపే కొత్త పార్లమెంట్ నిర్మాణం ప్రారంభానికి సిద్ధమైంది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయి తొమ్మిదేళ్లు పూర్తి అయిన సందర్భంగా పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభంకానుంది. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలోనే జరుగనున్నాయి.

ఆధునిక భారతదేశ వైభవానికి చిహ్నంగా..వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ కళల సమాహారం.. చేతికళలతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయి తొమ్మిదేళ్లు కానున్న సందర్భంగా మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం భారీ వేడుకను నిర్వహించనున్నారు. త్రిభుజాకారంలో ఉన్న ఈ పార్లమెంట్ హౌస్ నిర్మాణం నాలుగు అంతస్తులతో ఉంటుంది. ఇందులో 1224 మంది ఎంపీలకు సీటింగ్ ఏర్పాట్లు చేశారు. గతంలో కంటే భద్రతా వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్మించారు.