Pharma Companies: ఫార్మా కంపెనీల పొల్యూషన్‌పై NGT సీరియస్

ఫార్మా కంపెనీలు చేస్తున్న కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సీరియస్ అయింది. వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. తెలంగాణకు చెందిన గుమ్మి నరేంద్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో.

Pharma Companies: ఫార్మా కంపెనీల పొల్యూషన్‌పై NGT సీరియస్

Ngt On Pollution

Updated On : February 3, 2022 / 3:24 PM IST

Pharma Companies: ఫార్మా కంపెనీలు చేస్తున్న కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సీరియస్ అయింది. వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. తెలంగాణకు చెందిన గుమ్మి నరేంద్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషన్లో కాలుష్యంపై ఫిర్యాదు చేసినప్పటికీ కాలుష్యం సృష్టిస్తున్న కంపెనీల సంబంధిత విభాగాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అందులో పేర్కొన్నాడు.

ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటూ.. ఈ పొల్యూషన్ కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని విజ్ఞప్తి చేశాడు. దీనిపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వ్యవసాయ కమిషనర్ కు జస్టిస్ కె.రామకృష్ణ, ఎక్స్‌పర్ట్ మెంబర్ కె. సత్యగోపాల్ తో కూడిన చెన్నై-ఎన్జీటీ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

Read Also : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడి

పిటిషన్ పై తదుపరి విచారణను మార్చి3కు వాయిదా వేసింది ఎన్జీటీ న్యాయస్థానం.