Delhi’s Israel Embassy Blast : ఢిల్లీ పేలుడు వెనుక ఉన్నది వీళ్లే?..జాడ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు
ఈ ఏడాది జనవరి 29న న్యూ ఢిల్లీలో ప్రధాని,రాష్ట్రపతి హాజరైన బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న విజయ్ చౌక్ కి 2 కిలోమీటర్ల దూరంలోని అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయెల్ ఎంబసీ బయట సాయంత్రం సమయంలో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక ఆధారాలు సంపాదించింది.

Delhi's Israel Embassy Blast
Delhi’s Israel Embassy Blast ఈ ఏడాది జనవరి 29న న్యూ ఢిల్లీలో ప్రధాని,రాష్ట్రపతి హాజరైన బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న విజయ్ చౌక్ కి 2 కిలోమీటర్ల దూరంలోని అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయెల్ ఎంబసీ బయట సాయంత్రం సమయంలో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక ఆధారాలు సంపాదించింది.
పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితుల ఫుటేజీని మంగళవారం ఎన్ఐఏ విడుదల చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఇజ్రాయిల్ ఎంబసీ ముందు పేలుడు జరిగడానికి కొద్దిసేపు ముందు అనుమానస్పదంగా తిరుగుతూ కనిపించారు. అదేవిధంగా,ఒక్కో అనుమాతుడి జాడ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డుని కూడా ఎన్ఐఏ ప్రకటించింది.