మహారాష్ట్రలో ఆదివారం నుంచి నైట్ కర్ఫ్యూ
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా నిత్యం 30 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం 36 వేల 902 మంది వైరస్ బారినపడ్డారు.

Night Curfew In Maharashtra From Sunday Malls To Shut At 8 Pm
Night Curfew మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా నిత్యం 30 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం 36 వేల 902 మంది వైరస్ బారినపడ్డారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 26 లక్షల 37 వేలు దాటింది. 53 వేల 907 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కేసులు పెరుగుతున్న ఉద్ధవ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం(మార్చి-28,2021)నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. కర్ఫ్యూలో భాగంగా షాపింగ్ మాల్స్ రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకు మూసివేయబడతాయి.
కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టాలనే కోరిక తమ ప్రభుత్వానికి లేదని సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ప్రారంభించిన ఆరోగ్య సేవలకు కొరత రాకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి దృష్ట్యా హోలీ పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని స్పష్టం చేసింది. ఇక,ముంబైలో పబ్లిక్,ప్రైవేట్ ప్లేస్ లలో హోలీ వేడుకలపై ప్రభుత్వం నిషేధం విధించింది.