India:భారత్ లో తొమ్మిది కరోనా రహిత రాష్ట్రాలు

కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు

India:భారత్ లో తొమ్మిది కరోనా రహిత రాష్ట్రాలు

Updated On : January 20, 2022 / 4:22 PM IST

India;కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, గోవా,  డామన్ డయ్యూ,  దాద్రానగర్ హవేలీ, లక్ష్యదీప్, త్రిపురను కరోనా రహిత రాష్ట్రాలుగా ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి.

దేశంలో తొలి రెండు కరోనా రహిత రాష్ట్రాలుగా గోవా, మణిపూర్ నిలిచాయి. గోవాను కరోనా గ్రీన్ జోన్ గా ప్రకటించాలని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వైరస్ రహిత తొమ్మిదో రాష్ట్రంగా త్రిపుర గుర్తింపు పొందింది. రాష్ట్రంలో నమోదైన రెండో కరోనా రోగికి కూడా నెగెటివ్ అని తేలడంతో రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ తెలిపారు. తమది కరోనా రహిత రాష్ట్రమని సీఎం శుక్రవారం (ఏప్రిల్ 24, 2020) ప్రకటించారు.

దేశంలో ఇప్పటివరకు 5,25,667 మంది నుంచి 5,41,789 నమూనాలు సేకరించారు. వీటిలో 23,502 శాంపిల్స్ ను పాజిటివ్ గా తేల్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 23,077 కేసులు నమోదు అయ్యాయి.  4,748 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 718 మంది మృతి చెంచారు. గత 24 గంటల్లో 1,684 కేసులు నమోదు అయ్యాయి. 37 మంది మృతి చెందారు.