Leopard : చిరుతపులి దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి

బాలిక నది ఒడ్డున వెళ్తుండగా వెనుక నుంచి చిరుత దాడి చేసిందని సింగ్ పేర్కొన్నారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున శబ్దాలు చేయడంతో చిరుతపులి సమీపంలోని అడవికి పారిపోయిందని చెప్పారు.

Leopard : చిరుతపులి దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి

Leopard Attack

Updated On : December 19, 2023 / 7:30 AM IST

Leopard Killed Girl : యూపీలో చిరుతపులి దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం చిరుతపులి దాడి చేయడంతో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి నెహ్‌తౌర్ ప్రాంతంలోని బధివాలా గ్రామంలో నైనా అనే తొమ్మిదేళ్ల బాలిక పొలంలో పని చేస్తున్న తన తండ్రిని కలవడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.

బాలిక నది ఒడ్డున వెళ్తుండగా వెనుక నుంచి చిరుత దాడి చేసిందని సింగ్ పేర్కొన్నారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున శబ్దాలు చేయడంతో చిరుతపులి సమీపంలోని అడవికి పారిపోయిందని చెప్పారు. తీవ్రంగా గాయపడిన బాలికను ధాంపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన తెలిపారు.

Earthquake : చైనాలో భారీ భూకంపం…86మంది మృతి

చిరుతపులిని పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నైనా తండ్రి మహేంద్ర జార్ఖండ్‌కు చెందినవారు. కుటుంబసభ్యులతో కలిసి మహేంద్ర ఇక్కడికి వచ్చారు. బధియోవాలాలోని చెరకు పొలంలో కూలీగా పనిచేస్తున్నాడు.