చౌకీదార్ చోర్ కాదు..ప్యూర్: రాజ్ నాథ్ సింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2019 / 11:44 AM IST
చౌకీదార్ చోర్ కాదు..ప్యూర్: రాజ్ నాథ్ సింగ్

Updated On : March 26, 2019 / 11:44 AM IST

చౌకీదార్ చోర్ హై(కాపలాదారుడు దొంగ అయ్యాడు)అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ కాపలాదారు దొంగ కాదనీ, నిష్కళంకుడని, దేశంలోని రుగ్మతలను నయం చేసేవాడని, తిరిగి ఆయన దేశ ప్రధాని కావడం ఖాయమని రాజ్ నాథ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(మార్చి-26,2019) ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్‌ పై కూడా రాజ్‌నాథ్ నిప్పులు చెరిగారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు.ఆప్ నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.