నిర్భయ దోషులకు మరణశిక్ష మరింత ఆలస్యం…సీజేఐ సంచలన నిర్ణయం

  • Published By: venkaiahnaidu ,Published On : December 17, 2019 / 09:31 AM IST
నిర్భయ దోషులకు మరణశిక్ష మరింత ఆలస్యం…సీజేఐ సంచలన నిర్ణయం

Updated On : December 17, 2019 / 9:31 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఈ కేసులో నలుగురు దోషులు ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిందితుల్లో ఒకడైన అక్షయ్ తనకు విధించిన ఉరిశిక్షను పున:సమీక్షించాలని కోరుతూ సుప్రీంలో ఇటీవల రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాల్లో నెలకొన్న వాయుకాలుష్యం కారణంగా క్రమంగా ఆయుష్షు తగ్గిపోతుందని,ఇంక ప్రత్యేకంగా ఉరిశిక్ష ఎందుకు అంటూ నిందితుడు అక్షయ్ తన పిటిషన్ లో తెలిపాడు. అయితే ఈ రివ్యూ పిటిషన్ ను నిర్భయ తల్లిదండ్రులు వ్యతిరేకించారు. నిందితులు ఆలస్యపు ఎత్తుగడలు ప్లే చేస్తున్నారని వారు ఆరోపించిన విషయం తెలిసిందే.

అయితే ఈ రివ్యూ పిటిషన్ విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే మంగళవారం(డిసెంబర్-17,2019) సంచలన ప్రకటన చేశారు. బుధవారం(డిసెంబర్-17,2019) ఉదయం కొత్త ధర్మాసం ఈ పిటిషన్ ను విచారించనుంది. దీన్ని బట్టి చూస్తే నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో నిందితుల్లో మరో ముగ్గురు ముకేష్,పవన్ గుప్తా,వినయ్ శర్మలు దాఖలే చేసిన రివ్యూ పిటిషన్లను ఈ ఏడాది జులైలో సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.

అయితే నిర్భయ నిందితుడు  అక్షయ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను నిర్భయ తల్లిదండ్రులు వ్యతిరేకించారు. నిందితులు ఆలస్యపు ఎత్తుగడలు ప్లే చేస్తున్నారని వారు ఆరోపించారు. నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను వెంటనే ఉరితీసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఢిల్లీ కోర్టు బుధవారమే విచారణ చేపట్టనుంది.