ఉరి తీయటం అంత ఈజీ కాదు : వేస్తే రూ.25వేలు ఫీజు

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 10:11 AM IST
ఉరి తీయటం అంత ఈజీ కాదు : వేస్తే రూ.25వేలు ఫీజు

Updated On : January 17, 2020 / 10:11 AM IST

నిర్భయ రేపిస్టులకు జనవరి 22న ఉరి తీయనున్నారు. ఈ సందర్భంగా నిర్భయ దోషులకు ఉరి వేయనున్న తలారి పవన్ మీడియాతో మాట్లాడుతూ..ఉరి తీయటం అంత ఈజీ కాదనీ..ఉరి వేసేవారు మానసికంగా..శారీకంగా ధైర్యంగా ఉండాలని..ఉరి వేసే తలారి మానసికంగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు పవన్ జల్లాద్. ప్రస్తుతం తాను నిర్భయ దోషులకు ఉరి వేస్తే తనకు ఒక్కొక్కరికీ రూ.25వేలు ఇస్తారనీ..అలా నలుగురు దోషులకు కలిపి రూ.1లక్ష వస్తుందని తెలిపారు.   

మాది తలారుల వంశం  
మాది తలారుల వంశం. మా ముత్తాత పేరు లక్ష్మణ్ జల్లాడ్,  మా తాత కలు రామ్ జల్లాడ్, మా నాన్న మమ్ము జల్లాడ్..ఇప్పుడు నేను నాది నాలుగో తరం అని చెప్పారు. ‘ఉరి’వేయటం అంత ఈజీ కాదనీ చాలా బాధ్యతతో కూడినదనీ ఏమాత్రం పొరపాటు జరిగినా మా వంశానికే చెడ్డపేరు వస్తుంది. అంతేకాదు దోషులకు ఉరి సరిగ్గా పడకపోతే వారు చాలా బాధకు గురికావాల్సి ఉంటుంది. అలా ఎట్టి పరిస్థితుల్లోను జరగకూడదు. ఉరి తీసే విషయంలో చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని..చాలా విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
లారి మద్యం తీసుకోడు  
తలారి దోషులకు ఉరి వేసేటప్పుడు మద్యం తాగుతాడని అలా మద్యం తాగితేనే ఒక మనిషికి ఉరిశిక్ష వేయగలుగుతాడని అంటుంటారనీ..కానీ ఎట్టి పరిస్థితుల్లోను తాము 
ఉరితీసేవారు మద్యపానం చేయం..దేవుడి మీద ఒట్టు..నేను ఎప్పుడూ మద్యం తాగననీ తెలిపాడు. తలారులు మద్యం తాగుతారనే చాలా తప్పు అభిప్రాయం ఉందనీ కానీ అది నిజం కాదనీ..నేను ఎప్పుడూ మద్యం తీసుకోలేదు. మద్యం తాగినవారు అన్ని విధాలుగా పర్ ఫెక్ట్ గా ఉండలేరు. ఉరి తీసే సమయంలో ఉరి తాడు లాగే సమయంలో తాము ఎంతో సమన్వయంతో మానసిక స్థైర్యంతో ఉండాలని..చాలా అప్రమత్తంగా ఉంటామని మద్యం తాగినవారు అలా ఉండటం అసాధ్యం అని ఉరి వేసేవారు మద్యం తాగుతారు అనేది చాలా చాలా తప్పుడు అభిప్రాయమని పవన్ జల్లాద్ తెలిపాడు. 

ఉరి వేసేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నా
నిర్భయ దోషులకు ఉరి వేసే 
ఈ అవకాశం కోసం నేను నెలల తరబడి ఎదురు చూస్తున్నాననీ తెలిపాడు. ‘‘భగవాన్ నే మేరీ సన్ హాయ్ లి (దేవుడు చివరకు నా ప్రార్థనలు విన్నాడు) “అని మీడియాకు తెలిపాడు. వారిని జనవరి 22న వారిని ఉరి తీయటానికి నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకుంటున్నాను. ఉరి వేసే కొన్నిరోజులు ముందుగానే  నన్ను అధికారులు నన్ను జైలుకు తీసుకెళతారు. ఉరి సజావుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా..జరిగేలా తాను ఉరి తీసే స్థలాన్ని..అక్కడ ఉండే ప్రతీది చెక్ చేసుకోవాలనీ..దానికి తాను ముందుగానే రిహార్సల్స్ చేయవలసి ఉంటుందని అన్నాడు. 

ఉరిశిక్షలతోనే మాకు డబ్బులొస్తాయి 
పేదరికంలో ఉన్న పవన్ జల్లాద్ మాట్లాడుతూ..యూపి జైలు పరిపాలన విభాగం నాకు నెలకు 5,000 రూపాయలు చెల్లిస్తుంది. అంతకు మించి నాకు సంపాదించడానికి వేరే వనరులు లేవు. సిర్ఫ్ ఫ్యాన్సీ సే జీవన్ చల్ శక్తి హై (మరణశిక్షను అమలు చేయడం ద్వారా నేను డబ్బు సంపాదించగలను)” అని పవన్ చెప్పాడు. 

తన తాత ఐదుగురు దోషులకు ఉరిశిక్ష వేశాడని తెలిపాడు. తాను మొదటిసారి దోషికి  ఉరిశిక్ష వేసినప్పుడు 20-22 వయస్సు ఉందని.  అప్పుడు తన తాత తనతోనే ఉన్నాడని..ఇప్పుడు నా వయస్సు 58 ఏళ్లు అని చెప్పాడు. 1989 పాటియాలా సెంట్రల్ జైలులో బులాండ్‌షహార్ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో దోషిగా తన తాతతో చేసిన చివరి ఉరిశిక్ష పవన్ గుర్తుచేసుకున్నాడు.

ఉరి వేసినందుకు మా తాతకు రూ.200 ఇప్పుడు నాకు రూ.25వేలు 
తన తాత కలురామ్ ఉరి వేసినప్పుడు రూ.200లు ఇచ్చేవారని ఇప్పుడు తాను నిర్భయ దోషులకు ఉరి వేసినందుకు ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున నలుగురికీ కలిసి రూ.1లక్ష వస్తుందని అది ప్రస్తుతం తాను ఉన్న ఆర్థిక పరిస్థితికి చాలాఅవరసరమని ఆ డబ్బులతో నా కూతురి పెళ్లి చేస్తానని తాళిబొట్టు చేయిస్తానని పవన్ జల్లాడ్ తెలిపారు.

ఇందిరా గాంధీ హత్య కేసులో దోషుల్ని ఉరి వేసింది మా నాన్నా..తాత..
తన తండ్రి..తాత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన సత్వంత్ సింగ్, కేహర్ సింగ్లను ఉరితీశారనీ పవన్ జల్లాద్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు తన తాత తండ్రీ ఉరి వేసిన దోషుల పేర్లను కూడా ఈ సందర్భంగా పవన్ గుర్తు చేసుకున్నాడు. 

నిర్భయ దోషుల్ని ఉరి వేసే అవకాశం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు 
నిర్భయపై అత్యాచారం చేసిన కేసులో నలుగురు దోషుల మరణశిక్ష అమలు చేసినందుకు పవన్‌ను యుపి జైలు పరిపాలన ఎంపిక చేసింది. ఆ దోషులకు ఉరి వేయనున్న పవన్ జల్లాద్ మాట్లాడుతూ..నలుగురు దోషుల మరణశిక్ష వేసే అవకాశం నాకు వచ్చినందుకు పవన్ జల్లాడ్ దేవునికి..ఆ అవకాశం ఇచ్చిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు. పవన్ తండ్రి మమ్ము జల్లాడ్ ఉత్తర భారతదేశంలో సుప్రసిద్ధ హంగ్ మాన్ పేరొందాడు. .