Nirmala Sitharaman : కొత్త నోట్ల ముద్రణపై కేంద్రం క్లారిటీ

క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టాలని..కరోనా కారణంగా సతమతమవుతున్న పేద ప్రజలు, చిరు వ్యాపారులకు పంపిణీ చేయాలని విపక్షాలు సహా పలువురు ఆర్థిక నిపుణులు కేంద్రానికి సూచిస్తున్న విషయం తెలిసిందే.

Nirmala Sitharaman : కొత్త నోట్ల ముద్రణపై కేంద్రం క్లారిటీ

Nirmala

Updated On : July 26, 2021 / 8:51 PM IST

Nirmala Sitharaman క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టాలని..కరోనా కారణంగా సతమతమవుతున్న పేద ప్రజలు, చిరు వ్యాపారులకు పంపిణీ చేయాలని విపక్షాలు సహా పలువురు ఆర్థిక నిపుణులు కేంద్రానికి సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త నోట్ల ముద్రణ అంశంపై సోమవారం కేంద్ర ప్రభుత్వం సృష్టత ఇచ్చింది. కొత్త నోట్లు ముద్రించే ఆలోచ‌నే ప్ర‌భుత్వానికి లేద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం(జులై-26,2021) లోక్‌సభలో స్పష్టంచేశారు.

నోట్ల ముద్రణకు సంబంధించి ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్.. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని స్పష్టంచేశారు. క‌రోనాతో త‌లెత్తిన సంక్షోభానికి కొత్త నోట్ల‌ను ముద్రించ‌డం పరిష్కారం కాద‌ని ప్ర‌భుత్వం భావిస్తుందని నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. లాక్‌ డౌన్ ఆంక్షల సడలింపులతో క్రమంగా పరిస్థితులు సర్దుకుంటున్నాయన్నారు

క‌రోనా వ‌ల్ల గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో జీడీపీ 7.3 శాతానికి కుదించ‌క‌పోయింద‌న్న నిర్మలా సీతారామన్…ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి త‌మ ప్ర‌భుత్వం ఆత్మ నిర్బ‌ర్ భారత్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తుంద‌న్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల వెన్నుదన్నుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు(2021-22) ద్వితీయార్థం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో నడుస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

కాగా,ఈ ఏడాది మార్చిలో.. గత రెండేళ్లలో కొత్త 2 వేల రూపాయల కరెన్సీ నోట్లను ముద్రించలేదని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసిన విషయం తెలిసిందే.