KAMBALA : కంబళ క్రీడలో రికార్డు సృష్టించిన నిశాంత్.. 8.36 సెకన్లలో 100 మీటర్లు పరుగు

ప్రాంతీయ క్రీడలు యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఒకటి కంబళ క్రీడ. ఈ క్రీడ దక్షిణ కన్నడ, ఉడిపి, తుళునాడు తీర ప్రాంతాల్లో ప్రతీ ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయమైన క్రీడ.

KAMBALA : కంబళ క్రీడలో రికార్డు సృష్టించిన నిశాంత్.. 8.36 సెకన్లలో 100 మీటర్లు పరుగు

Kambala

Updated On : April 12, 2022 / 11:11 AM IST

KAMBALA : ప్రాంతీయ క్రీడలు యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఒకటి కంబళ క్రీడ. ఈ క్రీడ దక్షిణ కన్నడ, ఉడిపి, తుళునాడు తీర ప్రాంతాల్లో ప్రతీ ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయమైన క్రీడ. కంబళ ఆటలో ఎద్దులను ఉసికొల్పుతూ పోటీదారుడు బురద నీటిలో పరుగెత్తాల్సి ఉంటుంది. ఎవరైతే ఎద్దులను వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో ఎక్కువగా పాల్గొంటారు.

Kambala Srinivas Gowda : భారత ఉసేన్‌ బోల్ట్‌ శ్రీనివాస గౌడ మరో రికార్డు.. 8.78 సెకన్లలోనే..

కంబళ క్రీడ పేరు వింటేచాలు టక్కున గుర్తుకొచ్చే పేరు శ్రీనివాస్ గౌడ. గతేడాది జరిగిన కంబళ పోటీల్లో 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెంకన్లలోనే పూర్తిచేసి తన రికార్డును తానే గుర్తు తిరగరాశాడు. తాజాగా బజగోలి జోగిబెట్టు నివాసి నిశాంత్‌ శెట్టి అరుదైన ఘనత సాధించాడు. శ్రీనివాస్ గౌడ రికార్డును నిశాంత్ బ్రేక్ చేశాడు.

ద కింగ్ ఆఫ్ కంబాల: 45 మెడల్స్ తో ఇండియన్ బోల్డ్ శ్రీనివాస్ గౌడ ఆల్ టైం రికార్డ్

బెల్తంగండి తాలూకా వేనూరులో జరిగిన కంబళ పోటీలో నీశాంత్ పాల్గొని .. 100 మీటర్ల దూరాన్ని 8.36 సెకన్లలోనే చేరుకున్నారు. సీనియర్‌ విభాగంలో 10.44 సెకన్లలోనే 125 మీటర్ల దూరం పరుగెత్తాడు. ఇదిలాఉంటే నిశాంత్ శెట్టి గతంలో 100 దూరాన్ని 9.52 సెకన్లలో చేరుకున్నాడు. తాజా రికార్డుపై స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిషాంత్‌శెట్టిని ఓ ప్రకటనలో అభినందించారు.