ప్రతిభకు పట్టం : ఎంపీ కవితకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 03:49 AM IST
ప్రతిభకు పట్టం : ఎంపీ కవితకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్

Updated On : January 22, 2019 / 3:49 AM IST

హైదరాబాద్ : నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. తాము నిర్వహించిన సర్వేలో ఆదర్శ్ క్యాటగిరీలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికైనట్టు ప్రతిష్ఠాత్మక సంస్థ ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ జనవరి 21న  ప్రకటించింది. ఈ అవార్డును ఈ నెల 31న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఎంపీ కవితకు ప్రదానం చేయనున్నారు.

 

దేశ వ్యాప్తంగా లోక్‌సభ సభ్యుల్లో ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ 25 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.  దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీ కవిత ఎంపికయ్యారు. ప్రజల్లో మంచి ఆదరణ..సామాజిక సేవలో ముందుంటం..లోక్ సభ నిర్వహించే విధానంలో సమయస్ఫూర్తిగా రాష్ట్ర సమస్యలను ప్రస్తావించటం..మంచి వాక్చాతుర్యం..సభలో నియమ నిబంధలను పాటిస్తు  తన నియోజకవర్గం సమస్యలనే కాక..రాష్ట్ర సమస్యలను సభ దృష్టికి తీసుకురావటం.. వంటి పలు అంశాల ఆధారంగా జరిగిన ఈ సర్వేలో ఎంపీ కవిత ఈ అవార్డుకు ఎంపికయ్యాకు. దీంట్లో భాగంగా కవితకు 90 శాతానికిపైగా పాయింట్లువచ్చాయి. కవిత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, క్రియాశీలకంగా వ్యవహరించారని సర్వే రిపోర్టు తెలిపింది. 

 

 

అంతేకాదు స్వరాష్ట్రం కోసం చేసిన తెలంగాణ రెండదశ ఉద్యమంలో కవిత చురుగ్గా పాల్గొనటమే కాక…జైలుకెళ్లటం..పలు కేసులను కూడా ఎదుర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించి..రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చారు.తెరమరుగవుతున్న తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారనీ..మహిళా, సామాజిక సమస్యలపై ఉద్యమాలు, సదస్సుల నిర్వహణలో కవిత ప్రముఖ పాత్ర వహించారని చెప్పింది  ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయ ఆరంగ్రేటం చేసి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. తన మంచి వాగ్ధాటితో లోక్ సభలో కవిత లేవనెత్తిన అంశాలపై స్పీకర్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఈ అవార్డ్ వచ్చిన సందర్భంగా కవిత స్పందిస్తు.. ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపికచేసినందుకు ఎంపీ కవిత ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు మరింత కష్టపడి పనిచేయడానికి స్ఫూర్తినిస్తుందని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.