‘తబ్లిగీ’ తక్లీఫ్ : 9,000 మందికి క్వారంటైన్‌

  • Published By: madhu ,Published On : April 3, 2020 / 01:46 AM IST
‘తబ్లిగీ’ తక్లీఫ్ : 9,000 మందికి క్వారంటైన్‌

Updated On : April 3, 2020 / 1:46 AM IST

కనిపించని పురుగు (కరోనా వైరస్) ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలోకి ప్రవేశించిన ఈ మహమ్మారి..అందరినీ గడగడలాడిస్తోంది. దేశం మొత్తాన్ని లాక్ డౌన్ లోకి నెట్టేసింది కేంద్రం. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది ఈ రాకాసి. కానీ..కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ తీవ్ర ప్రకంపనలు రేపింది. తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరైన వారిలో చాలా మందికి ఈ వైరస్ సోకడం ఆందోళన కలిగించింది.

ఈ సమావేశాల్లో పాల్గొ్న్న వీరంతా..వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. వీరి మూలంగా పాజిటివ్ కేసులు అధికమౌతూ వస్తున్నాయి. అప్పటి వరకు తక్కువగా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా ఎక్కువ కావడంతో ప్రభుత్వ యంత్రాంగాలు అలర్ట్ అయ్యాయి. (COVID-19 : లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేస్తారా ? )

ఈ సమావేశాలకు హాజరైన వారిలో సుమారు 9 వేల మందిని క్వారంటైన్ లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఈ సమావేశాల్లో ఎవరు పాల్గొన్నారనే దానిపై దృష్టి సారించామని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ చెప్పారు.

ఈ సమావేశాలకు హాజరైన 9 వేల మందిని, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలించామన్నారు. ఇందులో వేయి 306 మంది విదేశీయులు, తెలంగాణలో 96 మంది, ఏపీలో 24 మంది విదేశీయులున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నుంచి ఖాళీ చేయించిన వారిలో ఇద్దరు కరోనా కరోనా కారణంగా 2020, మార్చి 02వ తేదీ గురువారం మరణించారని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. (టెన్షన్ టెన్షన్ : తెలంగాణ కరోనా @ 154 కేసులు)

 

* ఈ వైరస్ కు సంబంధించిన అధికారిక సమాచారం కోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడం జరిగిందని శ్రీ వాస్తవ తెలిపారు. 
* pibfactcheck@gmail.com అనే మెయిల్ అడ్రస్ కు పంపడం ద్వారా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. 
* ఒక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ విడుదల చేసింది. 

* ఆరోగ్య సేతు అని పిలుస్తున్న ఈ అప్లికేషన్ ద్వారా ఎవరైనా కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళితే..అధికారులకు తెలియచేయడం జరుగుతుంది. 
* కొత్తగా వ్యాధి బారిన పడిన వారి గుర్తించడం తెలుసుకోవచ్చు. 
 

* వారితో దగ్గరగా వ్యవహరించిన వారికి అలర్ట్ లు పంపుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 
* అప్లికేషన్ ఇంగ్లీషుతో పాటు 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండనుంది.