Tejashwi Yadav: కొత్త కార్లు కొనొద్దు.. అందరికీ నమస్కరించండి.. మంత్రులకు తేజస్వి యాదవ్ సూచన

తన పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన మంత్రులు ఎలా నడుచుకోవాలో చెబుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కొన్ని సూచనలు చేశారు. తమ శాఖ నుంచి కొత్త కార్లు కొనొద్దన్నారు. ప్రజలతో ఎవరూ కాళ్లు మొక్కించుకోవద్దన్నారు.

Tejashwi Yadav: కొత్త కార్లు కొనొద్దు.. అందరికీ నమస్కరించండి.. మంత్రులకు తేజస్వి యాదవ్ సూచన

Updated On : August 20, 2022 / 3:06 PM IST

Tejashwi Yadav: బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్.. తన పార్టీ తరఫున ఎన్నికైన మంత్రలకు పలు సూచనలు చేశారు. ఆర్జేడీ మంత్రులెవరూ తమ శాఖల తరఫున కొత్త కార్లు కొనొద్దని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రులు ఎలా నడుచుకోవాలో చెప్పారు.

Revanth Reddy: తెలంగాణ ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్సే: రేవంత్ రెడ్డి

ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెబుతూ కొన్ని సూచనలు చేశారు. ‘‘మంత్రులు పారదర్శకంగా, కఠినంగా వ్యవహరించాలి. పూలు, బొకేల బదులు, పుస్తకాలు, పెన్నులు వంటివి అందుకోండి. మంత్రులెవరూ తమ దగ్గర పనిచేసే వాళ్లతో, ప్రజలతో, కార్యకర్తలతో కాళ్లు మొక్కించుకోవద్దు. పేదలు, అవసరం కోసం వచ్చే వారి విషయంలో మర్యాదగా ఉండండి. వాళ్ల విషయంలో కులం, మతం వంటి పక్షపాతం చూపొద్దు. అలాగే విషయం ప్రాధాన్యాన్నిబట్టి వెంటనే స్పందించండి. మీ శాఖల్లో పారదర్శకత, నిజాయితీ ఉండేలా చూసుకోండి. మీ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోండి. దీనివల్ల నిజమైన సమాచారం ప్రజలకు తెలుస్తుంది’’ అని తేజస్వి సూచించారు.

Munawar Faruqui: మునావర్ షో జరిగేనా.. శిల్పకళా వేదిక వద్ద భారీ బందోబస్తు

నితీష్ కుమార్, తేజస్వి కలయికను బీజేపీ ‘జంగిల్ రాజ్’ అంటూ విమర్శిస్తున్న నేపథ్యంలో తేజస్వి చేసిన సూచనలు ఆ పార్టీపై సానుకూలత పెంచేలా ఉన్నాయి. ఇటీవలే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ నెల 24న బలపరీక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇటీవలే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు పలికారు.