దయనీయం:అత్యాచారానికి గురైన కూతురిని ఆస్పత్రికి వీపుపై మోసుకెళ్లిన తండ్రి

కామాంధులకు బలై..అత్యాచారానికి గురైన కూతురిని వీపుపై మోస్తూ.. హాస్పిటల్‌లో చేర్చిన తండ్రి దయనీయ ఘటన యూపీలో చోటుచేసుకుంది. అత్యాచారానికి గురైన 15 ఏళ్ల కూతుర్ని వీపు మీద మోసుకుంటూ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు ఆ తండ్రి. హాస్పిటల్‌లో వీల్ ఛైర్ అందుబాటులో లేకపోవడంతో తండ్రి ఆమెను వీపు మీదకు ఎక్కించుకుని మోసుకెళుతూ వైద్య పరీక్షలు చేయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమ ఇంటిపక్కన నివసిస్తున్న 19 ఏళ్ల యువకుడు ఆమెను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి గంటల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో ఆమె కాలు విరిగిపోయింది. దీంతో ఆమె నడిచే పరిస్థితి కూడా లేదు. దీంతో ఆ తండ్రి మానసి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.
గుండెలవిసేలా ఏడ్చిన తండ్రి కూతురు పరిస్థితిపై మర్హేరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అంకిత్ యాదవ్ ను అరెస్ట్ చేసారు. మహిళా కానిస్టేబుల్ ను ఇచ్చి బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. ఈ క్రమంలో బాధితురాలిని హాస్పిటల్ కు తీసుకెళ్లటానికి అంబులెన్స్ లేదు. వీల్ చైర్ లేదు..కనీసం స్ట్రచర్ కూడా లేదు. దీంతో అఘాయిత్యానికి బలై ప్రాణాలతో బైటపడ్డ కూతుర్ని వీపుపై మోసుకుంటూ హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. కూడా పోలీసులు ఉన్నాగానీ ఇటువంటి దుస్థితి అతనికి..కుమార్తెకు ఉండటం గమనించాల్సిన విషయం.
అలా కూతుర్ని మోసుకెళ్లిన ఆ తండ్రికి హాస్పిటల్ లో విపత్కర పరిస్థితి ఎదురైంది. హాస్పిటల్ లో బాధితురాలిని పరీక్షించటానికి ఎటువంటి పరికరాలు పనిచేయటంలేదని సిబ్బంది తెలిపారు. దీంతో కూతుర్ని హాస్పిటల్ కు వీపుపై మోసుకుంటూ వెళ్లిన ఈ వీడియోపై సీఎం జోక్యం చేసుకోవటంతో మంగళవారం (డిసెంబర్ 17) అలిఘర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ వీడియో ఉన్నతాధికారు విచారణకు ఆదేశించారు. దీనిపై మెడికల్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన అధికారులు..సంబంధిత అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.