Cold Wave : ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న చలిగాలులు…నాలుగు రోజులపాటు స్కూళ్లకు సెలవులు

ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6-9 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. పంజాబ్, హర్యానా వంటి ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 5వతేదీ వరకు చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు....

Cold Wave : ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న చలిగాలులు…నాలుగు రోజులపాటు స్కూళ్లకు సెలవులు

schools shut due to cold wave

Cold Wave : ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6-9 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. పంజాబ్, హర్యానా వంటి ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 5వతేదీ వరకు చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా జిల్లాలో తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి 6 వరకు పాఠశాలలను మూసివేయాలని సర్కారు ఆదేశించింది.

ALSO READ : Truckers : కేంద్రప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘం చర్చలు సఫలం…డ్రైవర్ల సమ్మె విరమణ

జనవరి 2 నుంచి 5 వరకు పంజాబ్,హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి, ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని జిల్లా యంత్రాంగం కూడా కఠినమైన శీతాకాల పరిస్థితుల కారణంగా I నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం జనవరి 6 వరకు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. వారణాసి జిల్లా యంత్రాంగం కూడా జనవరి 6 వరకు 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ALSO READ : Today Headlines : అయోధ్య రాముడి విగ్రహం ఇంకా ఖరారు కాలేదన్న రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు

జనవరి 5-11 మధ్య, రాత్రి ఉష్ణోగ్రత తగ్గుతుందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ఉత్తర ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్‌లోని దక్షిణ ప్రాంతాలలో చలి గాలులు వీస్తాయని మహాపాత్ర తెలిపారు. నిరుపేదలకు, నైట్ షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానికులు అధికార యంత్రాంగాన్ని కోరారు.