Truckers : కేంద్రప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘం చర్చలు సఫలం…డ్రైవర్ల సమ్మె విరమణ
కేంద్రప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘం చర్చలు సఫలం కావడంతో ట్కక్కు డ్రైవర్ల సమ్మె విరమించారు. కొత్త హిట్ అండ్ రన్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత డ్రైవర్లు విధులు చేరాలని ట్రక్కర్లు కోరారు...

Rush at petrol pump
Truckers : కేంద్రప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘం చర్చలు సఫలం కావడంతో ట్కక్కు డ్రైవర్ల సమ్మె విరమించారు. కొత్త హిట్ అండ్ రన్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత డ్రైవర్లు విధులు చేరాలని ట్రక్కర్లు కోరారు. కొత్త హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ట్రక్కర్లు పనిని పునఃప్రారంభించాలని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ కోరింది. ఈ విషయంపై ప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘం కీలక సమావేశం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ALSO READ : Earthquakes : అఫ్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్‌లో భూప్రకంపనలు…భయాందోళనల్లో ప్రజలు
హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల వరకు శిక్ష విధించే కొత్త నిబంధన ఇంకా అమలు కాలేదని, రవాణా శాఖతో చర్చించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. హిట్ అండ్ రన్ చట్టంలోని కొత్త శిక్షాస్మృతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనను ఉపసంహరించుకుంటామని ట్రక్కర్స్ అసోసియేషన్ తెలిపింది. హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల శిక్ష విధించే చట్టంపై ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్‌తో చర్చ జరిగింది.
ALSO READ : Today Headlines : అయోధ్య రాముడి విగ్రహం ఇంకా ఖరారు కాలేదన్న రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు
ఈ చట్టం ఇంకా అమలు కాలేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చెప్పారు. పదేళ్ల శిక్ష, జరిమానాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమృత్ లాల్ మదన్ అన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ట్రక్కర్‌ల సమ్మెతో దేశంలోని పెట్రోల్, డీజిల్ స్టేషన్‌లలో కొరత ఏర్పడింది. దేశంలోని ప్రజలు పెట్రోల్, డీజిల్ పంపుల వద్ద క్యూలో నిల్చున్నారు.