Earthquakes : అఫ్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్‌లో భూప్రకంపనలు.. భయాందోళనల్లో ప్రజలు

జపాన్ దేశాన్ని వణికించిన భూకంపం ఘటన మరవక ముందే మళ్లీ బుధవారం అప్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు....

Earthquakes : అఫ్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్‌లో భూప్రకంపనలు.. భయాందోళనల్లో ప్రజలు

Earthquake

Updated On : January 3, 2024 / 10:15 AM IST

Earthquakes : జపాన్ దేశాన్ని వణికించిన భూకంపం ఘటన మరవక ముందే మళ్లీ బుధవారం అప్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. అప్ఘానిస్థాన్ దేశంలోని ఫయాజాబాద్ ప్రాంతంలో బుధవారం అర్దరాత్రి సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.

ALSO READ : ఉప్పల్‌ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

ఫైజాబాద్ నగరానికి 126కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి మొదటిసారి భూమి కంపించింది. ఫైజాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో బుధవారం రాత్రి రెండోసారి సంభవించిన భూకంపం 4.8గా నమోదైంది. రెండు సార్లు వచ్చిన వరుస భూకంపాలతో అప్ఘాన్ ప్రజలు వణికిపోయారు.

ALSO READ : కొన్ని గంటల క్రితమే పార్టీలో చేరిక.. ఇంతలోనే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక.. బీజేపీ మాజీ ఎంపీకి ఆమెకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రూల్ ప్రాంతంలో బుధవారం అర్దరాత్రి 12.01 గంటలకు భూకంపం వచ్చింది. 26 కిలోమీటర్ల లోతుల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపూర్ దూర్ జిల్లాలో 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఒకేరోజు నాలుగు వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.