ఏంటీ కథ: రాజీవ్ పై మోడీ 15పైసల విమర్శలు

కాంగ్రెస్ ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా గతంలో ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మోడీ విమర్శలు గుప్పించారు. అవినీతి గురించి మన మాజీ ప్రధాని మాట్లాడటం మీరందరూ వినే ఉంటారని..ఢిల్లీ నుంచి పేదప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించే ప్రతి రూపాయిలో 15శాతం మాత్రమే గ్రామాలకు చేరుతుందని, మిగిలన 85 పైసలు కంటికి కనిపించకుండా పోతుందని ప్రధానిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించారు. స్వాతంత్ర్యం తర్వాత చాలా ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దీన్ని అంగీకరించిందని అన్నారు. ఈ లీకేజీని ఆపడానికి కాంగ్రెస్ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని తెలిపారు.
వారణాశిలో మంగళవారం(జనవరి 22, 2019) 15వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ప్రారంభించిన సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం మాత్రం లీకేజీలను అడ్డుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో లూటీ అయిన 85 శాతానికి టెక్నాలజీ సాయంతో 100 శాతం అడ్డుకోగలిగామని అన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి 5లక్ష్లల 80వేల కోట్లు వేశామని తెలిపారు. దేశం కనుక పాత సిస్టమ్ లోనే నడుస్తూ ఉంచే? ఒక్కసారి ఊహించుకోండంటూ మోడీ ప్రశ్నించారు. పాత సిస్టమే కనుక రన్ అవుతూ ఉంటే 4లక్షల 50వేల కోట్లు మాయమైపోయి ఉండేవని మోడీ అన్నారు. గతంలో కూడా రాజీవ్ గాంధీ 15 పైసల వ్యాఖ్యలపై మోడీ విమర్శలు గుప్పించారు. 2017లో కర్ణాటకలో ఓ ర్యాలీలో పాల్గొన్న మోడీ..తన లబ్ధిదారుడికి చేరువయ్యేందుకు ప్రతి రూపాయిని 15పైసలకు తగ్గించిన ఆ చేయి ఎవరిదంటూ పరోక్షంగా రాజీవ్ గాంధీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఎన్ఆర్ఐలను దేశపు బ్రాండ్ అంబాసిడర్లుగా ఈ సందర్భంగా మోడీ అభివర్ణించారు. దేశపు సామర్థ్యానికి ఎన్ఆర్ఐలు చిహ్నాలని తెలిపారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు మారిషస్, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి దేశాలకు నాయకత్వం వహిస్తున్నారని మోడీ అన్నారు.