Corona Update: భారత్‌కు మరో ముప్పు.. భారీగా పెరిగిన కరోనా కేసులు
భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా నెలలు గ్యాప్ తీసుకున్న కరోనా మరోసారి కోరలు చాచుతోంది.

Corona
Corona Update: భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా నెలలు గ్యాప్ తీసుకున్న కరోనా మరోసారి కోరలు చాచుతోంది. లేటెస్ట్‌గా ఒక్కరోజే 13 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మునుపటి రోజు కంటే ఈరోజు(30 డిసెంబర్ 2021). మొన్న 6 వేల కేసులు, నిన్న 9 వేల కేసులు, ఇవాళ 13 వేల కేసులు..! ఇలా కరోనా కేసులు రోజురోజుకు జేట్ స్పీడ్‌తో పెరిగిపోతున్నాయి.
ముఖ్యంగా కరోనా హాట్‌స్పాట్‌గా చెప్పుకునే మహారాష్ట్రపై కరోనా పడగ విప్పింది. 24గంటల్లో దాదాపు 4 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతీరోజూ మునుపటి రోజు కంటే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి.. నిన్న 70శాతం వరకు కేసులు పెరగగా.. ఈరోజు మొన్నటి కంటే 100శాతం కేసులు పెరిగాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా 950 దాటేసింది.
దేశంలో 500 కేసులు దాటి వారం రోజులు గడవకముందే వెయ్యికు దగ్గరగా ఒమిక్రాన్ కేసులు రికార్డవుతున్నాయి. ఒమిక్రాన్ స్పీడ్.. దేశంలోని 23 రాష్ట్రాలకు పాకగా.. మహారాష్ట్ర, ఢిల్లీల్లో వీరవిహారం చేస్తోంది. మహారాష్ట్రలో 250కుపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటు ఢిల్లీలోనూ దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒమిక్రాన్ కేసులు పెంచుకోవడంలో మహారాష్ట్ర, ఢిల్లీలు నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.
గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, కేరళలో 65, తెలంగాణ 62, తమిళనాడు 45, కర్ణాటక 43, ఏపీ 16, హర్యానా 12, బెంగాల్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 9ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి.
మొత్తం కరోనా కేసులు – మూడు కోట్ల 48 లక్షల 22 వేలు
మొత్తం డిశ్చార్జ్ – మూడు కోట్ల 42లక్షల 58వేల 778
మొత్తం యాక్టివ్ కేసులు- 82 వేల 402
మొత్తం మరణాలు- నాలుగు లక్షల 80 వేల 860
మొత్తం వ్యాక్సినేషన్ – 143 కోట్ల 83 లక్షల 22 వేల డోసులు