Kuno cheetahs : కునో నేషనల్ పార్క్‌లో చీతాలు మరణాలు సాధారణమే…నమీబియా రాయబారి వ్యాఖ్యలు

నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మధ్యప్రదేశ్‌కు తీసుకువచ్చిన పలు చీతాల మరణాలు సాధారణమైనవని నమీబియా హై కమిషనర్ ఆఫ్ ఇండియా గాబ్రియేల్ సినింబో చెప్పారు. చీతాల ప్రాజెక్ట్ జంతువులను కొత్త వాతావరణానికి పరిచయం చేస్తుందని ఆయన చెప్పారు....

Kuno cheetahs : కునో నేషనల్ పార్క్‌లో చీతాలు మరణాలు సాధారణమే…నమీబియా రాయబారి వ్యాఖ్యలు

Kuno cheetahs

Updated On : September 3, 2023 / 9:38 AM IST

Kuno cheetahs : నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మధ్యప్రదేశ్‌కు తీసుకువచ్చిన పలు చీతాల మరణాలు సాధారణమైనవని నమీబియా హై కమిషనర్ ఆఫ్ ఇండియా గాబ్రియేల్ సినింబో చెప్పారు. చీతాల ప్రాజెక్ట్ జంతువులను కొత్త వాతావరణానికి పరిచయం చేస్తుందని ఆయన చెప్పారు. (Kuno cheetah deaths normal) చీతాలు భారతదేశ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడగలవని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Jet Airways founder : నరేష్ గోయల్ విచారణలో వెలుగుచూసిన దిమ్మతిరిగే వాస్తవాలు

ఈ ఏడాది మార్చి నుంచి రెండు దేశాల నుంచి తీసుకొచ్చిన 20 చీతాల్లో మొత్తం తొమ్మిది మరణించాయి. కొత్త వాతావరణానికి చీతాలను పరిచయం చేసినపుడు మరణాల వంటి సవాళ్లు ఎదురవుతుంటాయని సినీంబో పేర్కొన్నారు. రెండు దేశాల నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కుకు 20 చీతాలు దిగుమతి చేయగా వీటిలో నమీబియా చీతా జ్వాలాకు నాలుగు కూనలు జన్మించాయి. చీతాల్లో మూడు పిల్లలతో సహా 9 మరణించాయి.

Delhi : ఢిల్లీ ప్రజలు 61 కోట్ల మద్యం బాటిళ్లు తాగారు…సర్కారుకు రూ.7,285 కోట్ల ఆదాయం

నరేంద్రమోదీ చీతాల ప్రాజెక్టును చేపట్టారు. చీతాలు సహజ కారణాల వల్ల మరణించాయని, రేడియో కాలర్ కారణం కాదని పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు. అయినా ఆరు చీతాల రేడియో కాలర్లను తొలగించారు. 14 చీతాలను కునోలోని ఎన్ క్లోజర్లలో ఉంచి పశువైద్యులు క్రమం తప్పకుండా వాటిని పర్యవేక్షిస్తున్నారు. 70 సంవత్సరాల క్రితం భారతదేశంలో అంతరించి పోయిన చీతాలను మళ్లీ విదేశాల నుంచి తెప్పించి వీటిని పెంచుతున్నారు.