Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి.. ఏం చెప్పారంటే
స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు.
PM Narendra Modi: స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో తమ డీపీని మార్చాలని, త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం మోదీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమ స్ఫూర్తితో మన సోషల్ మీడియా ఖాతాలోని డీపీలో త్రివర్ణ పతాకాన్ని ఉంచి దేశంతో మన సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదం చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన Facebook, Twitter ఖాతాల్లోని DPని మార్చారు. ప్రధాని సోషల్ మీడియా ఖాతాల్లోని DPలో త్రివర్ణ పతాకం యొక్క ఫోటో ఉంచారు.
ఇదిలాఉంటే ఆగస్టు 15న ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో 1,700 మంది ప్రత్యేక అథితులు పాల్గోనున్నారు. వీరిలో చైతన్యవంతమైన గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు పాల్గోనున్నారు. అదేవిధంగా జల్ జీవన్ మిషన్, పీఎం కిషాన్ సమ్మాన్ నిధి, అమృత్ సరోవర్ యోజన, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ వంటి వివిధ ప్లాగ్‌షిప్ ప్రోగ్రాంలకు సంబంధించిన వ్యక్తులుకూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
In the spirit of the #HarGharTiranga movement, let us change the DP of our social media accounts and extend support to this unique effort which will deepen the bond between our beloved country and us.
— Narendra Modi (@narendramodi) August 13, 2023